Hardik Pandya on Axar Patel: చివరి ఓవర్‌ అందుకే అక్షర్‌కు ఇచ్చాను.. హార్దిక్‌ కీలక వ్యాఖ్యలు-hahrdik pandya on giving final over to axar patel says they want to challenge themselves like this ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Hahrdik Pandya On Giving Final Over To Axar Patel Says They Want To Challenge Themselves Like This

Hardik Pandya on Axar Patel: చివరి ఓవర్‌ అందుకే అక్షర్‌కు ఇచ్చాను.. హార్దిక్‌ కీలక వ్యాఖ్యలు

చివరి ఓవర్ అక్షర్ కు ఇవ్వడంపై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు
చివరి ఓవర్ అక్షర్ కు ఇవ్వడంపై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు (BCCI-PTI)

Hardik Pandya on Axar Patel: చివరి ఓవర్‌ అక్షర్‌ పటేల్‌కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాడు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో చివరి ఓవర్లో 13 పరుగులను అక్షర్‌ విజయవంతంగా డిఫెండ్‌ చేయగలిగాడు.

Hardik Pandya on Axar Patel: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇండియా ఎలాగోలా 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ వేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. నిజానికి కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కోటా ఇంకా మిగిలే ఉంది. అయినా అక్షర్‌కు బంతిని ఇవ్వడంతో హార్దిక్‌ మళ్లీ గాయపడ్డాడా అన్న సందేహాలు కూడా కలిగాయి.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఆ ఓవర్‌ అక్షర్‌ చేతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మ్యాచ్‌ తర్వాత హార్దిక్‌ వివరించాడు. ఈ సందర్భంగా అతడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ కెప్టెన్‌గా అతనిలోని తెగింపుకు ఈ కామెంట్స్‌ అద్దం పడుతున్నాయి. మ్యాచ్‌లు ఓడితే ఓడతాం కానీ.. తమను తాము ఇలాంటి పరిస్థితుల్లో సవాలు చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హార్దిక్‌ చెప్పడం గమనార్హం.

"మేము అప్పుడప్పుడు ఓ మ్యాచ్ ఓడిపోతామేమో. ఏం ఫర్వాలేదు. ఈ టీమ్‌ను కఠినమైన పరిస్థితులకు అలవాటు పడాలని భావిస్తున్నాను. పెద్ద మ్యాచ్‌లలో ఇది మాకు ఉపయోగపడుతుంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో మేము బాగానే ఆడుతున్నాం. ఇలా మమ్మల్ని మేము సవాలు చేసుకుంటున్నాం. కఠినమైన పరిస్థితుల నుంచి యువకులంతా కలిసి టీమ్‌ను బయటపడేశారు" అని హార్దిక్‌ అన్నాడు.

అక్షర్‌ చివరి ఓవర్లో 13 రన్స్‌ను డిఫెండ్‌ చేయగలిగాడు. చివరికి ఇండియా 2 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి ఓవర్‌ హీరో అక్షర్‌ అటు బ్యాట్‌తోనూ రాణించాడు. 31 రన్స్‌ చేసి అజేయంగా నిలవడంతో శ్రీలంక ముందు 163 రన్స్‌ ఛాలెంజింగ్‌ టార్గెట్‌ను ఉంచగలిగింది.

ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన శివమ్‌ మావిపై కూడా హార్దిక్‌ ప్రశంసలు కురిపించాడు. తాను ఆడిన తొలి టీ20లోనే మావి 4 వికెట్లతో రాణించాడు. ఐపీఎల్‌ నుంచే అతని బౌలింగ్‌ చూస్తున్నానని, అతని బలాలేంటో తనకు తెలుసని హార్దిక్‌ అన్నాడు.

WhatsApp channel