India vs Sri Lanka 1st T20I: చెలరేగిన దీపక్, అక్షర్, ఇషాన్.. శ్రీలంక టార్గెట్ 163
India vs Sri Lanka 1st T20I: దీపక్ హుడా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ చెలరేగడంతో ఇండియా ఫైటింగ్ స్కోరు సాధించింది. శ్రీలంక ముందు 163 పరుగుల లక్ష్యం ఉంచింది.
India vs Sri Lanka 1st T20I: శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాప్, మిడిలార్డర్ విఫలమైనా టీమిండియా ఫైటింగ్ స్కోరు సాధించగలిగింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 29 బాల్స్‌లో 37 రన్స్ చేయడం.. చివర్లో దీపక్ హుడా (23 బాల్స్‌లో 41), అక్షర్ పటేల్ (20 బాల్స్‌లో 31) చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 రన్స్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియన్ టీమ్‌కు మొదట్లోనే షాక్ తగిలింది. కెరీర్‌లో తొలి టీ20 ఆడుతున్న శుభ్‌మన్ గిల్ 7 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (7), సంజూ శాంసన్ (5) కూడా వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 46 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో ఇషాన్ కిషన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
అయితే ఈ సమయంలో మొదట ఇషాన్ కిషన్ (29 బాల్స్‌లో 37), హార్దిక్ (27 బాల్స్‌లో 29) కూడా ఔటయ్యారు. దీంతో 94 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి ఇండియన్ టీమ్ కష్టాల్లో పడింది. ఈ దశలో దీపక్ హుడా, అక్షర్ పటేల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో లంక బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.