Greg Barclay As ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే ఏకగ్రీవం.. రెండోసారి తిరిగి ఎన్నికైన న్యూజిలాండ్ వ్యక్తి-greg barclay re elected as icc chairman jay shaw to head of finance committee ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Greg Barclay As Icc Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే ఏకగ్రీవం.. రెండోసారి తిరిగి ఎన్నికైన న్యూజిలాండ్ వ్యక్తి

Greg Barclay As ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే ఏకగ్రీవం.. రెండోసారి తిరిగి ఎన్నికైన న్యూజిలాండ్ వ్యక్తి

Maragani Govardhan HT Telugu
Nov 12, 2022 05:21 PM IST

Greg Barclay As ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020 నవంబరు నుంచి ఈ పదవీలో ఉన్న తాజా ఎన్నికతో మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే
ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే (Twitter/ICC)

Greg Barclay As ICC Chairman: అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా(ICC Chairman) మరోసారి గ్రెగ్ బార్‌క్లే నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఈ పదవీలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులానీ ఐసీసీ ఛైర్మన్ పదవీకి పోటీ పడి.. చివర్లో తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో.. గ్రెగ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. బీసీసీఐ సహా 17 మంది ఐసీసీ బోర్డు సభ్యులు గ్రెగ్‌కు మద్దతు ఇచ్చారు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ 2020 నవంబరు నుంచి రెండేళ్ల పాటు ఐసీసీ ఛైర్మన్‌గా ఉండగా.. తాజా ఎన్నికతో మరో రెండెళ్లపాటు కొనసాగనున్నారు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా తిరిగి ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చిన నా తోటి ఐసీసీ డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత రెండేళ్లలో మా క్రీడను విజయవంతమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి స్పష్టమైన దిశను అందించేందుకు వ్యూహాన్ని ప్రారంభించడం ద్వారా మేము గణనీయమైన పురోగతిని సాధించాం. అని గ్రెగ్ స్పష్టం చేశారు.

"క్రికెట్‌లో పాల్గొనడానికి ఇది ఓ ఉత్తేజకరమైన సమయం. మా ప్రధాన మార్కెట్ ఆటను బలోపేతం చేయడానికి, అలాగే పెంచడానికి సభ్యులతో కలిసి పనిని కొనసాగించడాన్ని ఎదురుచూస్తున్నాను. ప్రపంచంలో మరింత మంది క్రికెట్‌ను ఆస్వాదించగలరని భరోసా ఇస్తున్నాను." అని ఆయన అన్నారు.

ఈ ఏడాది నవంబరుతో గ్రెగ్ పదవీ కాలం ముగియనుండగా.. ఛైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవికి జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులానీ పోటీ చేసినప్పటికీ చివరి నిమిషంలో విత్ డ్రా చేసుకోవడంతో గ్రెగ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రెగ్ గతంలో ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్‌నకు డైరెక్టర్‌గా వ్యవహరించారు.

బార్ క్లే ఎన్నిక కాకుండా.. ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఐసీసీ ఫైనాన్స్-కమర్షియల్ అఫైర్స్ కమిటీ అధిపతిని కూడా ఎన్నుకున్నారు. బీసీసీఐ కార్యదర్శి జేషా ఈ పదవీకి ఎన్నికయ్యారు. ఐసీసీలో అత్యంత కీలకమైన కమిటీకి నేతృత్వం వహించే బాధ్యత షాకు వచ్చింది. ఐసీసీకి సంబంధించిన అన్నీ ప్రధాన ఆర్థిక విధాన నిర్ణయాలను ఈ కమిటీ తీసుకుంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్