India in ICC Tournaments: ఎన్నాళ్లీ వెయిటింగ్.. ఐసీసీ టోర్నీల్లో చేతులెత్తేస్తున్న ఇండియా-india in icc tournaments as wait continues after india lost to england in semifinal ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India In Icc Tournaments As Wait Continues After India Lost To England In Semifinal

India in ICC Tournaments: ఎన్నాళ్లీ వెయిటింగ్.. ఐసీసీ టోర్నీల్లో చేతులెత్తేస్తున్న ఇండియా

Hari Prasad S HT Telugu
Nov 10, 2022 05:26 PM IST

India in ICC Tournaments: ఎన్నాళ్లీ వెయిటింగ్‌.. అదే కథ.. అదే వ్యథ.. ఐసీసీ టోర్నీల్లో ఇండియా చేతులెత్తేస్తూనే ఉంది. 2014 నుంచి ఐసీసీ టోర్నీల్లో కొనసాగుతున్న వైఫల్యం.. 2022 టీ20 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్లోనూ కొనసాగింది.

మరోసారి ఐసీసీ టోర్నీ నాకౌట్ లో ఇంటిదారి పట్టిన టీమిండియా
మరోసారి ఐసీసీ టోర్నీ నాకౌట్ లో ఇంటిదారి పట్టిన టీమిండియా (AFP)

India in ICC Tournaments: టీ20 వరల్డ్‌కప్‌ 2022ను పాకిస్థాన్‌పై గెలిచి ఇండియా ఎంత ఘనంగా ప్రారంభించిందో.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతుల్లో ఓడి అంతకంటే దారుణంగా ముగించింది. కలిసికట్టుగా విఫలమై ఇంగ్లండ్‌ చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో మరోసారి ఐసీసీ టోర్నీ సెమీఫైనల్లో బోల్తా పడి కప్పు కోసం వెయిటింగ్‌ను కొనసాగిస్తూనే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

2013లో చివరిసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ టోర్నీని ఇండియా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మరో కప్పుడు ఇండియాకు రాలేదు. సెమీస్‌, ఫైనల్‌లలో ఓడుతూ నిరాశ పరుస్తూ ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ఐసీసీ టోర్నీల్లో ఇండియా బోల్తా పడుతూ వచ్చిందో ఓసారి చూద్దాం. ఆ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ నుంచి ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో 9 నాకౌట్‌ మ్యాచ్‌లలో ఆడిన ఇండియా మూడు గెలిచి, ఆరింట్లో ఓడింది.

2014 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. లంక చేతుల్లో ఓటమి

2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత ఏడాదే ఇండియా టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరింది. అయితే అక్కడ శ్రీలంక చేతుల్లో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 77 రన్స్‌ చేయడంతో ఇండియా 130 రన్స్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత చేజింగ్‌లో శ్రీలంక బ్యాటర్‌ సంగక్కర 52 రన్స్‌ చేజి అజేయంగా నిలవడంతో లంక 6 వికెట్లతో విజయం సాధించింది. 1996 తర్వాత శ్రీలంక గెలిచిన తొలి ఐసీసీ టోర్నీ ఇది.

2015 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి

ఆ మరుసటి ఏడాది ఇండియా మరో ఐసీసీ టోర్నీ గెలిచేలా కనిపించి బోల్తా కొట్టింది. 2015లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఇండియా.. ఆస్ట్రేలియా చేతుల్లో 95 రన్స్‌ తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ, ఫించ్‌ హాఫ్‌ సెంచరీతో ఆస్ట్రేలియా 7 వికెట్లకు 328 రన్స్‌ చేసింది. ఆ తర్వాత ఇండియా చేజింగ్‌లో చేతులెత్తేసింది. 46.5 ఓవర్లలో 233 రన్స్‌కే ఆలౌటైంది.

2016 టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌.. విండీస్‌తో ఓటమి

ఇక ఆ మరుసటి ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లోనే ఇండియాకు ఓటమే ఎదురైంది. ఈసారి వెస్టిండీస్‌ చేతుల్లో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 89 రన్స్‌ చేయడంతో ఇండియా 192 రన్స్‌ చేసింది. ఈ స్కోరును డిఫెండ్‌ చేసుకోవడం సులువే అనుకున్నా.. విండీస్ బ్యాటర్లు జాన్సన్‌ చార్లెస్‌ (52), లెండిల్‌ సిమన్స్‌ (82 నాటౌట్‌), ఆండ్రీ రసెల్‌ (43 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌.. పాక్‌ చేతుల్లో ఓటమి

తర్వాతి ఏడాది అంటే 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ చేరింది ఇండియా. కానీ పాకిస్థాన్‌ చేతుల్లో ఏకంగా 180 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మొదట బ్యాటింగ్‌ చేసి 4 వికెట్లకు 338 రన్స్‌ చేసింది. తర్వాత చేజింగ్‌ మహ్మద్‌ ఆమిర్‌ చెలరేగడంతో ఇండియా టాపార్డర్‌ కుప్పకూలింది. హార్దిక్‌ పాండ్యా 76 రన్స్‌ చేయడంతో ఇండియా 100లోపు ఆలౌట్‌ నుంచి తప్పించుకుంది. కానీ 158 రన్స్‌కే ఆలౌటై దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.

2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌.. న్యూజిలాండ్‌ చేతుల్లో ఓటమి

2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతుల్లో ఇండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ధోనీ రనౌట్‌ చాలా రోజుల పాటు ఇండియన్‌ ఫ్యాన్స్‌ను వెంటాడుతూనే ఉంది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 239 రన్స్‌ చేసింది. తర్వాత ధోనీ (50), జడేజా (77) హాఫ్ సెంచరీలతో పోరాడినా.. ఫలితం లేకపోయింది.

WhatsApp channel