Gambhir on Hardik Pandya: ఒక్క మ్యాచ్‌కే హార్దిక్‌ను జడ్జ్ చేయవద్దు.. అతడిని వెనకేసుకొచ్చిన గంభీర్-gautam gambhir backs hardik pandya and says do not judge him ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gambhir On Hardik Pandya: ఒక్క మ్యాచ్‌కే హార్దిక్‌ను జడ్జ్ చేయవద్దు.. అతడిని వెనకేసుకొచ్చిన గంభీర్

Gambhir on Hardik Pandya: ఒక్క మ్యాచ్‌కే హార్దిక్‌ను జడ్జ్ చేయవద్దు.. అతడిని వెనకేసుకొచ్చిన గంభీర్

Maragani Govardhan HT Telugu
Jan 06, 2023 06:31 PM IST

Gambhir on Hardik Pandya: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. హార్దిక్ పాండ్యాను వెనకేసుకొచ్చాడు. ఒక్క ఓటమితోనే అతడిని జడ్జ్ చేయకూడదని స్పష్టం చేశాడు. శ్రీలంకతో భారత్ ఓటమిపై పూర్తి బాధ్యత అతడిది కాదని తెలిపాడు.

గౌతమ్ గంభీర్
గౌతమ్ గంభీర్ (PTI)

Gambhir on Hardik Pandya: గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా పరాజయం కావడంతో హార్దిక్ పాండ్యపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. లంక జట్టు 206 పరుగుల భారీ స్కోరు చేయడంతో.. బౌలింగ్ పరంగా సరైన నిర్ణయాలు అతడు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడం, జట్టు కూర్పులో సమస్యలు పలు కారణాలతో అతడిని బాధ్యుడిని చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ప్రతి విషయానికి హార్దిక్‌ను జడ్జ్ చేయకూడదని స్పష్టం చేశాడు.

"అతడు చాలా బాగా చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌కు అతడిని జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే భారత్ ఓడిపోయినంత మాత్రాన అతడు ఏదో పొరపాటు చేసినట్లు కాదు. బౌలర్లు నో బాల్స్ వేయకుండా అతడు కంట్రోల్ చేయలేడు. అది పూర్తి బౌలర్ల బాధ్యత"అని గంభీర్ స్పష్టం చేశాడు.

పాండ్యాపై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్‌గా అతడు బాగా చేశాడని స్పష్టం చేశాడు. "హార్దిక్ కెప్టెన్‌గా బాగా చేశాడు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. సాధారణంగా దూకుడు స్వభావంగా ఉండే అతడు కూల్‌గా కనిపించాడు. అతడు తన ఆటగాళ్లకు మద్దతు ఇచ్చాడు. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలే కెప్టెన్‌కు చాలా ముఖ్యం. ప్రతి విషయాన్ని చాలా కూల్‌గా మెయింటేన్ చేశాడు." అని గంభీర్ స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మ దూరం కావడంతో హార్దిక్ పాండ్య ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడినే రెగ్యూలర్‌గా పొట్టి ఫార్మాట్‌కు సారథిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ దసున్ శనకా, కుశాల్ మెండీస్ అద్భుత అర్ధశతకాలతో విజృంభించారు. 207 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ విఫలం కావడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్