Euro 2024 Quarterfinals Schedule: యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎక్కడ, ఎప్పుడు చూడాలి?-euro 2024 quarterfinals full schedule portugal vs france spain vs germany england vs switzerland netherlands vs turkiye ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Euro 2024 Quarterfinals Schedule: యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎక్కడ, ఎప్పుడు చూడాలి?

Euro 2024 Quarterfinals Schedule: యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎక్కడ, ఎప్పుడు చూడాలి?

Hari Prasad S HT Telugu
Jul 04, 2024 01:23 PM IST

Euro 2024 Quarterfinals Schedule: యూరో కప్ 2024 క్వార్టర్స్ కు టైమ్ దగ్గర పడింది. టాప్ 8 యురోపియన్ ఫుట్‌బాల్ టీమ్స్ తలపడబోయే ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పూర్తి షెడ్యూల్ ఇదే.

యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎక్కడ, ఎప్పుడు చూడాలి?
యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎక్కడ, ఎప్పుడు చూడాలి? (REUTERS)

Euro 2024 Quarterfinals Schedule: యురోపియన్ ఛాంపియన్‌షిప్ లీగ్ స్టేజ్, ప్రీక్వార్టర్స్ మ్యాచ్ లు ముగిశాయి. ఇక ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ కు టైమ్ దగ్గర పడింది. తొలి మ్యాచ్ స్పెయిన్, జర్మనీలాంటి ఛాంపియన్ టీమ్స్ మధ్య జరగబోతోంది. శుక్రవారం (జులై 5) నుంచి ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు జరగనున్న నేపథ్యంలో పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకుందాం.

యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్

యూరో కప్ 2024లో లీగ్ స్టేజ్, ప్రీక్వార్టర్స్ ముగిసిన తర్వాత టాప్ 8 టీమ్స్ క్వార్టర్స్ చేరాయి. ఎన్నో దశాబ్దాలుగా యూరప్ లో ఫుట్‌బాల్ ను శాసిస్తున్న స్పెయిన్, జర్మనీ, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, తుర్కియే క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టాయి. ఇప్పుడీ టీమ్స్ నాలుగు సెమీస్ బెర్తుల కోసం తలపడబోతున్నాయి.

స్పెయిన్ వర్సెస్ జర్మనీ

తొలి క్వార్టర్ ఫైనల్లో హోస్ట్ టీమ్ జర్మనీ.. మాజీ ఛాంపియన్ స్పెయిన్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ స్టట్‌గార్ట్ లో భారత కాలమానం ప్రకారం శుక్రవారం (జులై 5) రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి స్పెయిన్ టాప్ ఫామ్ లో ఉంది. ఈ 4 మ్యాచ్ లలో ఆ టీమ్ 9 గోల్స్ చేసింది. అటు జర్మనీ నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచి, చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ను డ్రా చేసుకుంది. ఆ టీమ్ నాలుగు మ్యాచ్ లలో 10 గోల్స్ చేసింది.

పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్

యూరో కప్ 2024 రెండో క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్, ఫ్రాన్స్ తలపడనున్నాయి. తన చివరి యూరో కప్ ఆడుతున్నానని పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో చెప్పడంతో ఈ మ్యాచ్ పై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఇటు పోర్చుగల్లో రొనాల్డో, అటు ఫ్రాన్స్ లో ఎంబప్పె యూరో కప్ లో చివరిసారి ఫేస్ టు ఫేస్ తలపడబోతున్నారు.

ప్రీక్వార్టర్స్ లో స్లొవేనియాపై పెనాల్టీల్లో గెలిచి ఊపిరి పీల్చుకున్న పోర్చుగల్.. క్వార్టర్స్ లో బలమైన ఫ్రాన్స్ ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్

ఇంగ్లండ్, స్విట్జర్లాండ్ మధ్య మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ శనివారం (జులై 6) రాత్రి 9.30 గంటలకు జరుగుతుంది. ఈ సీజన్లో అంతంతమాత్రంగానే ఆడినా కూడా అదృష్టవశాత్తూ క్వార్టర్స్ చేరింది ఇంగ్లండ్ టీమ్. జెయింట్ కిల్లర్స్ గా పేరుగాంచిన స్విట్జర్లాండ్ తో మ్యాచ్ ఇంగ్లండ్ కు పెద్ద సవాలుగా మారనుంది.

నెదర్లాండ్స్ వర్సెస్ తుర్కియే

ఇక యూరో కప్ 2024 చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నెదర్లాండ్స్, తుర్కియే మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. గ్రూప్ స్టేజ్ లో మూడో స్థానంలో నిలిచి ప్రీక్వార్టర్స్ చేరిన నెదర్లాండ్స్.. అక్కడ మాత్రం రొమేనియాను 3-0తో ఓడించి క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. అటు తుర్కియే టీమ్ ప్రీక్వార్టర్స్ లో ఆస్ట్రియాను 2-1తో చిత్తు చేసింది.

యూరో కప్ 2024లో భాగంగా జరగనున్న ఈ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లన్నీ ఇండియాలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్, సోనీలివ్ యాప్, వెబ్‌సైట్ లలో లైవ్ చూడొచ్చు.

WhatsApp channel

టాపిక్