Dinesh Karthik thanks Ashwin: నన్ను కాపాడినందుకు థ్యాంక్స్.. అశ్విన్‌తో కార్తీక్ వీడియో వైరల్
Dinesh Karthik thanks Ashwin: నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అంటూ అశ్విన్‌తో కార్తీక్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా బీసీసీఐ ఈ వీడియో షేర్ చేసింది.
Dinesh Karthik thanks Ashwin: అశ్విన్‌తో కార్తీక్ ఆ మాట ఎందుకు అన్నాడు అనేగా మీ డౌట్. ఈ వీడియో చూస్తే మీకు ఆ విషయం స్పష్టమవుతుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఇండియన్ ప్లేయర్స్ చాలా ఉత్సాహంగా కనిపించారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత సోమవారం సిడ్నీ చేరుకున్నారు.
దీపావళి కూడా కావడంతో ఆ రోజంతా ప్లేయర్స్ ప్రాక్టీస్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకున్నారు. టీమిండియా సిడ్నీ చేరుకున్న వీడియోను బీసీసీఐ మంగళవారం (అక్టోబర్ 25) షేర్ చేసింది. ఇందులో ఒకచోట కార్తీక్, అతని వెనుకే అశ్విన్ ఉన్నారు. ఈ సందర్భంగా అశ్విన్‌ను చూపిస్తూ.. నిన్న నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని కార్తీక్ అనడం విశేషం.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్ డ్రామా గుర్తుంది కదా. 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన సమయంలో ఐదో బంతికి కార్తీక్ ఔటయ్యాడు. మంచి ఫినిషర్‌గా పేరున్న అతడు కీలకమైన సమయంలో ఔటై తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే ఆ తర్వాత వచ్చిన అశ్విన్ తీవ్ర ఒత్తిడిలోనూ సమయోచితంగా ఆడాడు. నవాజ్ వైడ్ బాల్‌ను సరిగ్గా అంచనా వేయడంతోపాటు చివరి బంతిని సులవుగా మిడాఫ్ మీదుగా తరలించి ఇండియాను గెలిపించాడు.
తాను చేయాల్సిన పనిని అశ్విన్ చేయడంతో కార్తీక్ సరదాగా ఇలా అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే కార్తీక్‌పై తీవ్ర విమర్శలు వచ్చేవి. గెలవడంతో అతని వైఫల్యాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రిషబ్ పంత్‌లాంటి ప్లేయర్‌ను పక్కన పెట్టి మరీ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి గొప్ప ఫినిషర్‌గా ఎదిగిన కార్తీక్‌కు టీమ్ ఎక్కువ అవకాశాలు ఇస్తోంది. దీంతో అతని ఆటతీరును అందరూ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు.
పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ చివరి ఓవర్ తొలి బంతికి ఔటైనా కూడా వచ్చేది కార్తీక్ కావడంతో అతడు చూసుకుంటాడులే అనే భరోసాతో ఫ్యాన్స్ కనిపించారు. కానీ ఈసారి కార్తీక్ అంచనాలను అందుకోలేకపోయాడు. 2 బాల్స్‌లో కేవలం 1 రన్ చేసి ఔటయ్యాడు.