Aakash Chopra on Kohli: కోహ్లి తన జీవితాన్ని ఓ సన్యాసిలా గడిపాడు: ఆకాశ్ చోప్రా
Aakash Chopra on Kohli: కోహ్లి తన జీవితాన్ని ఓ సన్యాసిలా గడిపాడంటూ ఆకాశ్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గురువారం (జులై 20) వెస్టిండీస్ తో ప్రారంభం కానున్న టెస్ట్ కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్ అయిన విషయం తెలిసిందే.
Aakash Chopra on Kohli: తన కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్న విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. విరాట్ తన జీవితాన్ని ఓ సన్యాసిలా జీవించాడని అతడు అనడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో 500వ మ్యాచ్ ఆడబోతున్న నాలుగో భారత ప్లేయర్ గా విరాట్ కోహ్లి రికార్డు క్రియేట్ చేయనున్నాడు.
"క్రికెట్ పట్ల విరాట్ కోహ్లికి ఉన్న అంకితభావం ఎంతో మనందరికీ తెలుసు. విరాట్ తన జీవితం మొత్తం ఓ సన్యాసిలా గడిపాడు. అతని జీవితం మొత్తం క్రికెటే. ఆ కారణం వల్లే అతడు ఈ స్థాయికి చేరాడు. ఈ అందమైన ఆటకు అతడు బ్రాండ్ అంబాసిడర్. ఇండియన్ క్రికెట్ అనే కాదు క్రికెట్ కు కూడా అతడు చేసిన సేవలను అందరం రుణపడి ఉంటాం" అని జియో సినిమాలో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా అన్నాడు.
ఈ మైలురాయిని అందుకోబోతున్న కోహ్లికి మరిన్ని రికార్డులు సాధించేలా ఈ మ్యాచ్ స్ఫూర్తి నింపుతుందని మరో మాజీ క్రికెటర్ ఓఝా ఆశాభావం వ్యక్తం చేశాడు. "ఇది చాలా ప్రత్యేకమైన ఘనత. చాలా కొద్ది మందే ఈ రికార్డు అందుకుంటారు. దేశం కోసం మరిన్ని మంచి ఇన్నింగ్స్ ఆడేలా ఈ మ్యాచ్ అతనిలో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నా" అని ఓఝా అన్నాడు.
మరో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. అతని క్రమశిక్షణ, ఫిట్‌నెస్ వల్లే ఇది సాధ్యమైందని అన్నాడు. "ప్రతి ఒక్కరూ 500 మ్యాచ్ లు ఆడలేరు. ఇంత సుదీర్ఘ కెరీర్ అభినందించదగినది. తనను తాను ఫిట్ గా ఉంచుకుంటూ, ఫామ్ కొనసాగిస్తూ అంతర్జాతీయ క్రికెట్ లో 75 సెంచరీలు చేశాడు. అతని క్రమశిక్షణ, అంకితభావానికి ఇదే నిదర్శనం. ఇప్పటికే 500 మ్యాచ్ లు ఆడిన విరాట్.. మరిన్ని ఆడగలడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు అతడు రోల్ మోడల్" అని జాఫర్ అన్నాడు.
సంబంధిత కథనం