(1 / 6)
Bat Sponsorship: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా రూ.100 కోట్లకు ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎమ్మారెఫ్ తో డీల్ కుదుర్చుకున్నాడు. 2025 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. కేవలం ఈ బ్యాట్ స్పాన్సర్‌షిప్ తోనే అతడు ఏడాదికి రూ.12.5 కోట్లు అందుకుంటున్నాడు.
(2 / 6)
Bat Sponsorship: విరాట్ కోహ్లి కంటే ముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉండేవాడు. తన కెరీర్లో చాలా వరకూ బ్యాట్ స్పాన్సర్‌షిప్ ను ఎమ్మారెఫ్ తోనే అతడు కుదుర్చుకున్నాడు. దీనికోసం సచిన్ ఏడాదికి రూ.8 కోట్లు వసూలు చేసేవాడు.
(3 / 6)
Bat Sponsorship: ప్రస్తుత క్రికెటర్లలో కోహ్లి తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతడు సియెట్ సంస్థతో ఏడాదికి రూ.4 కోట్లకుగాను బ్యాట్ స్పాన్సర్‌షిప్ డీల్ కుదుర్చుకున్నాడు.
(4 / 6)
Bat Sponsorship: రోహిత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. అతడు డీఎస్‌సీ సంస్థతో ఏడాదికి రూ.3.3 కోట్ల బ్యాట్ స్పాన్సర్‌షిప్ డీల్ కుదుర్చుకున్నాడు.
(5 / 6)
Bat Sponsorship: వార్నర్ తర్వాత రూ.2.45 కోట్ల డీల్ తో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అతడు న్యూ బ్యాలెన్స్ కంపెనీతో ఈ ఒప్పందం చేసుకున్నాడు.
(6 / 6)
Bat Sponsorship: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఈ బ్యాట్ స్పాన్సర్‌షిప్ విషయంలో మాత్రం వెనుకబడ్డాడు. అతడు స్పార్టాన్ సంస్థతో ఏడాదికి రూ.2.2 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు.
ఇతర గ్యాలరీలు