Sachin-Kohli : ఒకే మైదానం.. అప్పుడు సచిన్, ఇప్పుడు కోహ్లీ.. సేమ్ టు సేమ్
IND VS WI 2nd Test Virat Kohli : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 121 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 29 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే మైదానంలో సచిన్ కూడా రికార్డు సృష్టించాడు.
వెస్టిండీస్ తో రెండో టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ సాధించాడు. క్రికెట్ గాడ్ గా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కూడా ఇదే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మైదానం(port of spain ground)లో తన 29వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2002లో సచిన్ ఇలా చేశాడు. ఇప్పుడు అదే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ స్టేడియంలో 21 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ తన 29వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు.
ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాపై 186 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో తన టెస్టు సెంచరీ కరువును ముగించిన కోహ్లి, వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 500వ మ్యాచ్ కాగా ఈ సెంచరీ అతనికి చాలా ప్రత్యేకం. ఈ సెంచరీతో విరాట్ తన 29వ టెస్టు సెంచరీని, ఓవరాల్‌గా 76వ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేశాడు. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
విదేశీ గడ్డపై తాను ఎదుర్కొంటున్న టెస్ట్ సెంచరీ కరువును నుంచి బయటపడ్డాడు కోహ్లీ. సచిన్ కూడా తన 29వ టెస్టు సెంచరీ ఇదే మైదానంలో చేయడం విశేషం. 2002లో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించింది. ఆ టూర్ లోనూ ఈ మైదానంలోనే రెండో టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్.. 117 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సచిన్ టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీ, ఇప్పుడు కోహ్లీ టెస్టుల్లో 29వ సెంచరీ అదే మైదానంలో నమోదు చేశారు.
కోహ్లీ సెంచరీతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్న కోహ్లీ మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదేవిధంగా విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ(Anushka Sharma) తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో విరాట్ కోహ్లీ ఫోటోను హార్ట్ సింబల్‌తో పోస్ట్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అదేవిధంగా ప్రస్తుత సంవత్సరంలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, వేగంగా 76 శాతం స్కోర్ చేసిన ఆటగాడు వంటి అనేక రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు.