Pro Kabaddi League 10: బెంగాల్ శుభారంభం.. బెంగళూరుకు మరో ఓటమి-bengal warriors beat bengaluru bulls in pro kabaddi league season 10 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pro Kabaddi League 10: బెంగాల్ శుభారంభం.. బెంగళూరుకు మరో ఓటమి

Pro Kabaddi League 10: బెంగాల్ శుభారంభం.. బెంగళూరుకు మరో ఓటమి

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 04, 2023 11:18 PM IST

Pro Kabaddi League season 10: ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‍లో బెంగళూరు బుల్స్ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బెంగాల్ వారియర్స్ గెలిచింది. మరో మ్యాచ్‍లో పునేరీ పల్టాన్ విజయం సాధించింది. వివరాలివే..

Pro Kabaddi League 10: బెంగాల్ శుభారంభం.. బెంగళూరుకు మరో ఓటమి
Pro Kabaddi League 10: బెంగాల్ శుభారంభం.. బెంగళూరుకు మరో ఓటమి

Pro Kabaddi League season 10: ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 10వ సీజన్‍లో బెంగాల్ వారియర్స్ శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‍లో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. మణీందర్ సింగ్ సూపర్-10 సాధించడంతో బెంగాల్ గెలిచింది. అహ్మదాబాద్‍లో నేడు (డిసెంబర్ 4) జరిగిన పీకేఎల్ మ్యాచ్‍లో బెంగాల్ వారియర్స్ 32 - 30 తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. కాగా, బెంగళూరు జట్టుకు ఈ సీజన్‍లో వరుసగా ఇది రెండో ఓటమిగా ఉంది. వివరాలివే..

ఈ మ్యాచ్‍లో మొదటి నుంచి బెంగాల్ వారియర్స్.. బెంగళూరు టీమ్‍పై ఆధిక్యతను చూపింది. ఓ దశలో 7-4తో నిలిచింది. అయితే, నీరజ్ నర్వాల్ సూపర్ రైడ్ చేయడంతో బెంగళూరు బుల్స్ పుంజుకుంది. కానీ, ఆ తర్వాత బెంగాల్ ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడారు. మొదటి హాఫ్ ఆట ముగిసే సమయానికి బెంగాల్ 14-11తో ముందంజలో నిలిచింది.

రెండో హాఫ్‍లో బెంగళూరును ఆలౌట్ చేసి ఓ దశలో 27-16 పాయింట్ల ఆధిక్యంతో బెంగాల్ దూసుకెళ్లింది. అయితే, ఆ తర్వాత బెంగళూరు క్రమంగా పుంజుకుంది. అయినా చివరి వరకు ఆధిపత్యాన్ని కొనసాగించిన బెంగాల్ ఎట్టకేలకు విజయం సాధించింది.

ఈ మ్యాచ్‍లో బెంగాల్ వారియర్స్ ఆటగాడు మనీందర్ సింగ్ 11 పాయింట్లతో సూపర్-10 సాధించాడు. బెంగళూరు బుల్స్ టీమ్ తరఫున భరత్ 6, నీరజ్ నర్వాల్ 5 పాయింట్లు చేసి టీమ్ టాప్ స్కోర్లుగా నిలిచారు. ఈ మ్యాచ్‍లో రైడింగ్‍లో రాణించడంతో బెంగాల్ గెలిచింది.

మరో మ్యాచ్‍లో పుణెరీ పల్టాన్స్ 37 - 33 తేడాతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్‍పై విజయం సాధించింది. జైపూర్ ప్లేయర్ అరుణ్ దేశ్వాల్ 17 పాయింట్లతో సత్తాచాటిన ఫలితం లేకుండా పోయింది. పుణెరీ పల్టాన్స్ టీమ్‍లో అస్లాం ఇనాందార్ సూపర్-10 సాధించాడు. మోహిత్ గోయత్ 8 పాయింట్లు చేశాడు.