Harmanpreet Kaur : మర్యాదగా ప్రవర్తించాలి కదా.. హర్మన్‌ప్రీత్ కౌర్‌పై బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్-bangladesh captain nigar sultana comments on harmanpreet kaur over photograph session india vs bangladesh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Harmanpreet Kaur : మర్యాదగా ప్రవర్తించాలి కదా.. హర్మన్‌ప్రీత్ కౌర్‌పై బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్

Harmanpreet Kaur : మర్యాదగా ప్రవర్తించాలి కదా.. హర్మన్‌ప్రీత్ కౌర్‌పై బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్

Anand Sai HT Telugu
Jul 24, 2023 10:36 AM IST

India Vs Bangladesh : భారత మహిళా కెప్టెన్ హర్బన్‌ప్రీత్ కౌర్ చర్యలపై బంగ్లాదేశ్ మహిళల జట్టు కెప్టెన్ నిఖార్ సుల్తానా చేసిన వ్యాఖ్యలు అభిమానులను షాక్‌కి గురిచేశాయి. హర్బన్‌ప్రీత్ మర్యాదగా ప్రవర్తించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేసింది బంగ్లా కెప్టెన్.

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో పర్యటించిన భారత మహిళల జట్టు టీ20, వన్డే సిరీస్‌లలో పాల్గొంది. టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోగా, వన్డే సిరీస్ 1-1తో సమమైంది. ఈ స్థితిలో 3వ వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు(Bangladesh Team) 50 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు(Team India) 33.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. మెుత్తానికి 225 పరుగులకే కుప్పకూలింది టీమిండియా.

గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లు ట్రోఫీని పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎల్బీడబ్ల్యూ అని అంపైర్ నిర్ణయంతో ఏకీభవించని హర్మన్‌ప్రీత్ కౌర్.. వికెట్లను బ్యా్ట్ తో కొట్టింది.

అంతే కాకుండా అవార్డు వేడుకలో విమర్శించింది. అనంతరం ట్రోఫీని పంపిణీ చేసే సమయంలో ఇరు జట్లు గ్రూప్‌ ఫొటోలు దిగారు. అప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ బంగ్లాదేశ్ జట్టును అంపైర్లను వెంట తీసుకురావాలని చెప్పింది. దీంతో ఆగ్రహించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు రెస్ట్‌రూమ్‌కి వెళ్లారు. ఫొటో సెషన్ నుంచి వెళ్లిపోయారు.

ఇది క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్‌కు 75 శాతం పెనాల్టీ, 3 డి-మెరిట్ పాయింట్లు వచ్చాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ ఘటన గురించి బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా(Nigar Sultana) మాట్లాడుతూ, హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా కొంత సభ్యతతో ప్రవర్తించి ఉండాల్సిందని అన్నారు. ఏం జరిగిందో నేను చెప్పకూడదు, కానీ ఆ లొకేషన్‌లో నా టీమ్‌తో కలిసి ఉండటం సరైనది అనిపించలేదని పేర్కొంది. ఆ వాతావరణం కూడా అనువైనది కాదని, ఆ కారణంగా మేము లాంజ్‌కి తిరిగి వెళ్ళామని వెళ్లడించింది. 'క్రికెట్ ఆటలో క్రమశిక్షణ, గౌరవం చాలా ముఖ్యం. ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇవ్వకపోతే, ఆమె నాటౌట్ కాదు. అంపైర్ నిర్ణయాన్ని అంగీకరిస్తాం. అంపైర్ ఔట్ ఇస్తే మేము హర్మన్‌ప్రీత్ లాగా ప్రవర్తించం.' అని కామెంట్స్ చేసింది.

Whats_app_banner