Signature: మీరు పెట్టె సంతకం మీరు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పేస్తుంది-what is the effect of signature on a persons life know the opinion of astrologer ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Signature: మీరు పెట్టె సంతకం మీరు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పేస్తుంది

Signature: మీరు పెట్టె సంతకం మీరు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పేస్తుంది

Gunti Soundarya HT Telugu
Sep 09, 2024 04:36 PM IST

Signature: ప్రతి వ్యక్తి తన స్వంత మార్గంలో సంతకం చేస్తాడు. ప్రతి సంతకం వ్యక్తి స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మీరు పెట్టె సంతకాన్ని బట్టి మీరు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి మీరు పెట్టె సంతకం ఏమి చెబుతుందో తెలుసుకోండి.

మీ సంతకం మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది
మీ సంతకం మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది

Signature: ప్రతి చిన్న పనికి సంతకం తప్పనిసరి. నిరక్షరాస్యులు సైతం తమ పేరు సంతకంగా రాయడం కోసం నేర్చుకుంటారు. సంతకం లేకుండా చాలా ఫార్మాలిటీలు పూర్తి కావు. అది ఉద్యోగం, వ్యాపారం లేదా ఏదైనా బ్యాంకు సంబంధిత పని కావచ్చు.

కొందరు తమ పూర్తి పేరు సంతకంగా రాస్తే మరికొందరు మాత్రం పేరులోని కొన్ని అక్షరాలు సంతకంగా పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ అనుసరిస్తారు. కొందరి సంతకాలు అయితే అర్థం కూడా కాకుండా ఉంటాయి. మీకు తెలుసా వాస్తు శాస్త్రం ప్రకారం సంతకం ద్వారా మీరు మీ వ్యక్తిత్వాన్ని లేదా స్వభావాన్ని కూడా వెల్లడిస్తారు. ఒక వ్యక్తి సంతకం ఎలా ఉంటే అది జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. మనం పెట్టె సంతకం మన వ్యక్తిత్వాన్ని నిజంగానే చెబుతుందా అనే విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

సంతకం ఎంత చెప్తుందో తెలుసా?

మీరు పెట్టె సంతకం మీ జీవితంపై లోతైన ప్రభావం చూపుతుంది. సంతకంలో పేరు మాత్రమే రాసి ఇంటి పేరు రాసే వారు ఎవరి మాట వినరు. వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటారు. ఎవరైనా ఏదైన చెప్తే దాన్ని తీసుకునేందుకు అంగీకరించరు. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు.

కొందరి సంతకం పిచ్చి గీతలు గీసినట్టు ఉంటుంది. అది పెట్టిన వారికి తప్ప ఎదుటి వారికి అసలు అర్థం కాదు. ఏంటి ఇది కోడి చిందరవందరగా చేసినట్టు ఉందని సరదాగా అంటుంటారు. హడావుడిగా, అస్పష్టంగా సంతకం చేసే వ్యక్తులు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి వాళ్ళు చాలా తెలివైనవారు. ఎవరినైనా మోసం చేయవచ్చు.

కొందరి సంతకం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. చాలా స్టైలిష్ గా సైన్ చేస్తారు. కళాత్మకమైన, ఆకర్షణీయమైన సంతకాలు చేసే వ్యక్తులు సృజనాత్మక స్వభావం కలిగి ఉంటారు. వారి ఆలోచనలు కూడా కొత్తగా ఉంటాయి. అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తారు.

పేరు ఒక విధంగా రాస్తూ సంతకం మరొక విధంగా పెడతారు కొందరు. ఎవరి సంతకం వారి చేతిరాతలా ఉంటుందో, వారు ప్రతి పనిని సరిగ్గా చేస్తారు. క్రమశిక్షణ పాటిస్తారు. అన్నింటినీ సమయానుసారం చేయాలని అనుకుంటారు. వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

మీరు సైన్ ఇలా చేస్తారా?

మీ సంతకం నుండి మీ స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం సంతకం చేసేటప్పుడు ఒక్కసారి కూడా పెన్ను ఆపకుండా రాస్తారు చాలా మంది. అలాంటి వారికి చాలా మంది స్నేహితులు ఉంటారు. వారిది ఫ్రెండ్లీ నేచర్ గా ఉంటుంది.

అన్ని అక్షరాలు స్పష్టంగా కనిపించే వారి సంతకాల వ్యక్తులను సులభంగా అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఇలాంటి వాళ్ళ సంతకం గజిబిజిగా కాకుండా చక్కగా ప్రతి అక్షరం కనిపిస్తుంది. వారి సంతకం మాదిరిగానే వాళ్ళు కూడా చాలా పారదర్శకంగా ఉంటారు.

తమ సంతకాలలోని అక్షరాలను వక్రీకరించే వ్యక్తులు వాటిని గుర్తించడం, అర్థం చేసుకోవడం కష్టమని నమ్ముతారు. షార్ట్ కట్ లేకుండా సంతకంలో పూర్తి పేరు రాసుకునే వారు ప్రతిభా సంపన్నులని అంటారు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

టాపిక్