Nrisimha Dwadashi: ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశి ప్రాముఖ్యత ఏంటి?
Nrisimha Dwadashi: ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశి ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల కలిగే ప్రతిఫలం ఏంటి అనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలిపారు.
Nrisimha Dwadashi: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం నరసింహ అవతారం కుజగ్రహ ప్రభావితమైనదని చెబుతారు. నరసింహస్వామి ఆరాధన వలన కుజ గ్రహ అనుగ్రహం పొందుతారు. కుజదోషం వంటి దోషాలు తొలగడానికి నృసింహ ద్వాదశి వంటి రోజులలో లక్ష్మి నరసింహ స్వామిని ఆరాధించినటువంటి వారికి దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశిగా వ్యవహరిస్తారు. ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతా ప్రవత సమాహారంగా పేర్కొంటారు. శిశిర రుతువుకు ముగింపు పలికే ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథిలోనూ ఓ విశేషం ఉంటుంది. ఆ విశేషాన్ని అనుసరించి వ్రతం ఆచరిస్తారు. ఈ రోజున వైష్ణవ ఆలయాలను సందర్శించడం వలన శుభఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయని చిలకమర్తి తెలిపారు.
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ రోజున పూజిస్తే అప్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ ద్వాదశినాడు గంగాస్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయి.
ఈరోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించటం చాలా మంచిది. అంతేకాదు మహిళలు సీతామాత పూజ, విష్ణు పూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. గోవింద ద్వాదశిని కూడా నరసింహ ద్వాదశిగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజును పండుగలా జరుపుకుంటారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.