Vrischika Sankranti 2022 : ఈరోజు అలా పూజలు చేస్తే.. ఆర్థిక సమస్యలు ఉండవట..
Vrischika Sankranti 2022 : తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజును వృశ్చిక సంక్రాంతి అంటారు. పంచాంగంలో దానిని చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు వృశ్చిక సంక్రాంతి రోజు.. కొన్ని పనులు చేస్తే.. ఆ సమస్య దూరం అవుతుందని భక్తులు భావిస్తారు.
Vrischika Sankranti 2022 : హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయి. సూర్యుడు ప్రతి రాశిలో సుమారు 1 నెల పాటు ఉంటాడు. ఇలా సూర్యుడు తన రాశిని మార్చుకున్న రోజును.. ఆ రాశులను బట్టి పలు సంక్రాంతులుగా చెప్తారు. తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజును వృశ్చిక సంక్రాంతి అంటారు. అయితే ఈ సంవత్సరం వృశ్చిక సంక్రాంతి 16 నవంబర్ 2022 బుధవారం.. అంటే ఈరోజు వచ్చింది. మతపరమైన వ్యక్తులు, విద్యార్థులు, ఆర్థిక ఇబ్బంది ఉన్నవారు, ఉపాధ్యాయులకు ఈ రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
వృశ్చిక సంక్రాంతి మతం, దానం, స్నానానికి సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుకే ఈరోజు పేదలకు ఆహార పదార్థాలు, బట్టలు తదితర అవసరమైన వస్తువులను అందజేస్తారు.
వృశ్చిక రాశి సంక్రాంతి 2022 ముహూర్తం
* సూర్య రాశి మార్పు - రాత్రి 07.29 (తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించే సమయం)
* వృశ్చిక రాశి సంక్రాంతి శుభ సమయం - మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు
* వ్యవధి - 05 గంటల 24 నిమిషాలు
* వృశ్చిక సంక్రాంతి మహా పుణ్య కాలం - మధ్యాహ్నం 03:48 - సాయంత్రం 05:36 వరకు
* వ్యవధి - 01 గంట 48 నిమిషాలు
వృశ్చిక రాశి సంక్రాంతి ప్రత్యేక పూజా విధానం
* ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి సూర్యభగవానుని పూజించాలి.
* ఎరుపు నూనె దీపం వెలిగించండి.
* ధూపం వేయండి. పూజలో పసుపు, కుంకుమ మొదలైనవి ఉండేలా చూసుకోండి.
* దేవునికి ఎరుపు, పసుపు పువ్వులను సమర్పించండి.
* ప్రసాదంలో బెల్లంతో చేసిన హల్వాను సమర్పించండి. పసుపు, కుంకుమ కలిపిన నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
* ఎర్రచందనం దండతో 'ఓం దినకరాయ నమః' అనే మంత్రాన్ని జపించండి.
* పూజ అనంతరం తయారు చేసిన భోగాన్ని అందరికీ ప్రసాదంగా పంచండి. అందరికీ శుభం కలగాలని కోరుకోండి.
* మీరు పరీక్షలో విజయం సాధించాలనుకుంటే.. ఈ రోజు సూర్య భగవానుడికి ఖర్జూర ఫలాన్ని ప్రసాదంగా సమర్పించి.. పూజ చేసిన తర్వాత పేద విద్యార్థులకు ఈ ఖర్జూరాన్ని పంచండి.
వృశ్చిక సంక్రాంతి 2022 ప్రాముఖ్యత
వృశ్చిక సంక్రాంతిని క్రమం తప్పకుండా పూజించేవారు.. సూర్యభగవానుడికి.. పూజలు సక్రమంగా నిర్వహిస్తారు. ఇలా చేస్తే వారి జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. విద్యార్థులు పరీక్షలలో, ఉద్యోగస్తులు వృత్తిలో మంచి ఫలితాలను పొందుతారని నమ్ముతారు.
ఈ వృశ్చిక సంక్రాంతి రోజు దానధర్మాలు చేయడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పుణ్యం పొందడానికి పేదలకు వివిధ వస్తువులను దానం చేస్తారు. అంతే కాకుండా ఈ రోజున బ్రాహ్మణులకు గోవులను దానం చేయడం కూడా చాలా శ్రేయస్కరం. అంతే కాకుండా వృశ్చిక సంక్రాంతి నాడు స్నానం చేయడం కూడా గొప్ప ప్రాముఖ్యతగా చెప్తారు.
సంబంధిత కథనం