Buddha Statue - Vastu Tips। ఇంట్లో బుద్ధుడి విగ్రహంతో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? వాస్తు నియమాలు ఇవిగో!
Buddha Statue - Vastu Tips: ఇంట్లో బుద్ధుడి విగ్రహం ఉంటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, ఏ చోటున ఉంచాలి, వాస్తు నియమాలు ఏం చెబుతున్నాయి? మొదలైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
మన దేశంలో ముఖ్యంగా హిందూ సమాజంలో వాస్తును నమ్మేవారు చాలా మంది ఉంటారు. స్తును సరిగ్గా పాటించడం ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా, కొత్త సమస్యలు ఏమి రావని దృఢంగా నమ్ముతారు. వాస్తుపరంగా ఇంట్లోని వస్తువులను అమర్చుకోవడం ద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు.
హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో బుద్ధుని బొమ్మ ఉంచడం విషయంలో కూడా వాస్తును పాటిస్తారు. అలాగే ఇంట్లో బుద్ధుని విగ్రహం ఉండడం వల్ల ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మనసులు నిర్మలంగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
1. Vastu Tips for Placing Buddha Statue - బుద్ధుని విగ్రహం ఉంచడానికి వాస్తు చిట్కాలు
ఇటీవల కాలంలో మీరు చూస్తున్నట్లయితే చాలా మంది ఇళ్లలో బుద్ధుడి విగ్రహం ఉంచుకుంటున్నారు. లేదా తమ తోటలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి వాస్తు ప్రకారంగా బుద్ధుడి విగ్రహం ఉంచడానికి సరైన చోటు ఏది? వాస్తు నియమాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద బుద్ధుని విగ్రహం
ఇంటి ముఖ ద్వారం దగ్గర బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం మంచిది. ద్వారం వద్ద బుద్ధుడి విగ్రహం వెలుపల నుండి వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకుంటుంది. ఇంటికి చాలా మంది వస్తూ పోతుంటారు. చెడు దృష్టీని నివారించడానికి ప్రవేశ ద్వారం వద్ద బుద్ధ విగ్రహం ఉంచవచ్చు. అయితే, విగ్రహం భూమి నుండి 3-4 అడుగుల ఎత్తులో ఉండాలి.
లివింగ్ హాల్‌లో బుద్ధ విగ్రహం
వాస్తు ప్రకారం, బుద్ధుని విగ్రహాన్ని లివింగ్ హాల్‌లో కూడా ఉంచవచ్చు. అయితే ఇది పశ్చిమ దిశలో ఉంచడం మంచిది. ఇలా ఉంచడం ద్వారా ఇది శాంతిని సృష్టిస్తుంది. బుద్ధుని విగ్రహాన్ని శుభ్రమైన టేబుల్ లేదా షెల్ఫ్ మీద ఉంచండి. గదిలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం వల్ల శాంతి కలుగుతుంది. ఇల్లు కూడా అందంగా కనిపిస్తుంది.
ఇంటి పక్కన తోటలో పెట్టుకోవచ్చు
ఇంటి చుట్టూ కాస్త స్థలం ఉంటే మొక్కలు పెంచాలని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ మొక్కల మధ్యలో బుద్ధుని విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. ధ్యాన స్థితిలో ఉండే బుద్ధుడి విగ్రహం లేదా ఒక పక్కగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఉండే బుద్ద విగ్రహం ఉంచడం మంచిది.
పూజా గదిలో
చాలామంది పూజ గదిలో బుద్ధుని పూజిస్తారు. ఇది మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా తెస్తుంది. అలాగే ధ్యానం, యోగా చేసే ప్రదేశంలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచితే ఏకాగ్రత పెరుగుతుంది. ఇంటి తూర్పు భాగంలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచవచ్చు.
పిల్లల గదిలో
మీ పిల్లలు చదవడానికి ఆసక్తి చూపకపోతే, వారి గదిలో ఒక చిన్న బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. దీంతో పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. నెమ్మదిగా చదువుపై ఆసక్తి చూపుతారు. వాస్తు స్టోర్ లో మీకు చాలా రకాల బుద్ధ విగ్రహాలు లభిస్తాయి, వాటి అర్థాలు కూడా వేరుగా ఉంటాయి. వాటి ఆధారంగా చిన్న విగ్రహం తెచ్చుకుంటే చాలు.
2. బుద్ధుని విగ్రహం ఉంచడానికి వాస్తు నియమాలు
- బుద్ధుని విగ్రహాన్ని నేలపై ఉంచవద్దు, ఎల్లప్పుడూ మీ కంటి స్థాయికి పైన ఉండేలా చూడండి.
- బుద్ధుని విగ్రహాన్ని రిఫ్రిజిరేటర్లు లేదా ఇతర పెద్ద ఉపకరణాల దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. పెద్ద వస్తువులు సానుకూల వైబ్‌లను అడ్డుకుంటాయి.
- విగ్రహం ఎల్లప్పుడూ తూర్పు దిశకు అభిముఖంగా ఉండాలి. మూలలోని శక్తిని ఉత్తేజపరిచేందుకు మీరు దానిని ఈశాన్య దిశలో ఉంచవచ్చు.
- బుద్ధుని విగ్రహాన్ని బాత్రూమ్, స్టోర్‌రూమ్ అలాగే లాండ్రీ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు.
- విగ్రహాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి, దానిపై మురికిని ఉంచవద్దు.
- బుద్ధుని విగ్రహాన్ని గది బయటి వైపు కాకుండా లోపలి వైపు ఉండేలా చేయండి, అది అదృష్టంగా పరిగణించబడుతుంది.
- సానుకూలత అవసరమని మీరు భావించే గదిలో నిల్చున్న భంగిమలో ఒక చేతితో ఆశీర్వదిస్తున్న బుద్ధ విగ్రహాన్ని ఉంచాలి.
జ్ఞానోదయం పొంది బుద్ధుడి రూపం పొందిన వ్యక్తి విగ్రహం కావున, ఇంట్లో బుద్ధ విగ్రహం కచ్చితమైన ప్రదేశంలో ఉంచడం ద్వారా సామరస్యం, ప్రశాంతత, జ్ఞానంతో ఆశీర్వాదం లభిస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని సమాచారం పూర్తిగా నిజం అని చెప్పలేం, అందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.
సంబంధిత కథనం
టాపిక్