Vastu Tips for Home Garden । ఇంటికి ఏ దిశలో పెరడు ఉంటే మంచిది? వాస్తు నియమాలు చూడండి!
Vastu Tips for Home Garden: ఇంట్లో మొక్కలు ఉండటం మంచిదే, అయితే వాటిని సరైన దిశలో పెంచితేనే సానుకూల ప్రభావాలు ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతుంది.
ఇల్లు కట్టుకునేటపుడు మొక్కల కోసం కూడా కొంత స్థలం కేటాయించుకోవడం చాలా మంచిది. ఇంట్లో మొక్కలు ఉంటే ఇంటికి అందం, ఆ ఇంట్లో ఆనందం రెండూ ఉంటాయి. ఆఫీసులో కూడా చిన్న చిన్న మొక్కలు ఉంచుకుంటే అవి మీ మనసుకు ప్రశాంతమైన భావాన్ని కలిగించి మీ పని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
వాస్తుపరంగా కూడా ఇంట్లో మొక్కలు ఉండటం చాలా శుభప్రదం. వివిధ రకాల సమస్యలను దూరం చేయడంలో, ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో కొన్ని మొక్కల ప్రభావం ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతారు. తులసి మొక్క ఇంట్లో ఉండటం మంగళకరమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం రోజూ ఉదయం 4-5 తులసి ఆకులు నములుతుంటే ఆందోళన దూరం అవుతుంది.
ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించేందుకు మొక్కలు నాటుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే వాటిని నాటేందుకు సరైన ప్రదేశం, దిశ కూడా ముఖ్యమే. ఇంట్లో మొక్కలు నాటేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. ఈ నియమాలను సక్రమంగా పాటిస్తే ప్రతి పని చక్కగా జరిగి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.
మరి ఇంట్లో మొక్కలు పెంచుకునేందుకు వాస్తు ప్రకారం ఏ దిశ ఉత్తమమైనది, ఏ మూలలో మొక్కలు ఉంటే అనుకూల ఫలితాలు ఉంటాయి. పెరడు లేదా తోట ఇంటికి ఏ భాగంలో ఉండాలి? ఏ వైపున ఉండకూడదు మొదలైన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips for Home Garden - ఇంట్లో మొక్కలు నాటేందుకు వాస్తు నియమాలు
- వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటికి ఉత్తరం, తూర్పు దిక్కులో మొక్కలు ఉండటం, తోటను పెంచడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటికి ఈ రెండు దిశలలో తోటను పెంచుకుంటే, మీ ఇంట్లో సానుకూల శక్తి ఎల్లప్పుడూ ఉంటుంది, ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది.
- వాస్తు శాస్త్రం ప్రకారం, పెరడు ఎప్పుడూ ఇంటికి దక్షిణ లేదా పడమర దిశలో ఉండకూడదు. ఈ దిశలో మొక్కలు నాటితే ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుంది.
- ఉత్తర దిశలో మొక్కలు నాటితే మీ కెరీర్‌లో కొత్త అవకాశాలను తెస్తుంది. మీ కెరీర్ వృద్ధిని సాధించడంలో సహాయపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను ఉత్తర దిశలో నాటడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
- వాస్తు శాస్త్రం ప్రకారం, ముళ్ల మొక్కలను ఇంటికి ఉత్తరం వైపు నాటకూడదు. మీరు మీ ఇంట్లో ఎరుపు లేదా గులాబీ మొక్కలను నాటాలని ఆలోచిస్తున్నట్లయితే, వాస్తు శాస్త్రం ప్రకారం దానిని ఆగ్నేయం లేదా నైరుతి దిశలో నాటాలి. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులు, సంతోషాలను మోసుకొస్తుంది.
- వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ఆవరణలో పండ్ల చెట్లను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు ఇంట్లో పండ్ల చెట్టును నాటాలనుకుంటే, ఎల్లప్పుడూ తూర్పు దిశలో నాటండి.
- ఇంట్లో చింత చెట్టు, రాగి చెట్టు ఉండటం మంచిది కాదు. వేప చెట్టును ఉంచుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని సమాచారం పూర్తిగా నిజం అని చెప్పలేం, అందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.
సంబంధిత కథనం
టాపిక్