Vastu Tips । మీ ఇంటి ప్రాంగణంలో వీటిని ఉంచుకుంటే మీకన్నీ కష్టాలు, నష్టాలే!
ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మీరు ఊహించని అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంటి ప్రాంగణం కూడా వాస్తు నియమానుసారంగా ఉండాలి. మీ ఇంటి ప్రాంగణంలో ఇలాంటి వాస్తు దోషాలను సరిచేసుకోండి.
ఇంటి వాస్తు సరిగ్గా ఉంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లోని వారు తమ జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతాయి, వివాహాలు కుదరకపోవచ్చు, పదేపదే అనారోగ్యం బారినపడవచ్చు, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఇలాంటి ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఇంటి వాస్తు విషయంలో జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి సంబంధించిన ప్రతి దిశను ఏదో ఒక దేవత పరిపాలిస్తుంది. అందువల్ల ఇంటిలోపల ఉంచిన ప్రతి వస్తువుకు దాని ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని వస్తువులు ఇంటి లోపల ఉండాలి, కొన్ని ఇంటి వెలుపల ఉండాలి. ఇంటి లోపల ఉంచుకునే వస్తువులను సరైన దిశలోనూ ఉంచడం ముఖ్యం. తప్పు దిశలో ఉంచితే ప్రతికూల శక్తి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది. ఇంటి వెలుపల, గుమ్మం వద్ద, ప్రాంగణంలో కూడా వాస్తు నియమాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
Vastu Tips for Home
వాస్తు ప్రకారంగా ఇంటి ప్రాంగణంలో ఉండకూడనివి ఏవో ఇక్కడ తెలుసుకోండి.
చెత్త
ఇదివరకు చెప్పినట్లుగా ఇంటికి సంబంధించిన ప్రతి దిశను ఏదో ఒక దేవత పరిపాలిస్తుంది. కాబట్టి ఇంటికి ఏ మూలలోనూ చెత్తచెదారాలు, బూజు లేకుండా చూసుకోవాలి. ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రాంగణం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందమైన ముగ్గులు వేసుకోవాలి. పరిశుభ్రమైన ఇంటిలో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు.
అయితే ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా, చెత్తచెదారాలతో ఉంటే అది పేదరికానికి సంకేతం. ఆ ఇంట్లో కూడా ఎప్పుడూ అశాంతి, రోగాలు, ధన నష్టం వంటి సమస్యలు ఉంటాయి.
ప్రధాన ద్వారం
వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ దాని ముందు ఉండే రోడ్డు కంటే ఎత్తులో ఉండాలి. ప్రధాన ద్వారానికి ఎదురుగా రహదారి ఉంటే ఆ ఇల్లు ప్రతికూల శక్తికి బాటలు పరిచినట్లే. అలాంటి ఇళ్లలో ఎప్పుడూ రోగాలు, తగాదాలు ఉంటాయి.
ముళ్ల మొక్కలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు ముళ్ల మొక్కలు నాటకూడదు. ఇది వాస్తులో నిషిద్ధంగా పరిగణిస్తారు. ఎదురుగా ముళ్ల మొక్కలు ఉన్న ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండవు. శ్రేయస్సు లభించదు, జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి.
ఇంటి ముందు రాళ్లు
ఇంటి ముందు ఎలాంటి రాళ్లురప్పలు లేకుండా చూసుకోవాలి. నిర్మాణ పనుల కోసం కూడా ఉపయోగించే మార్బుల్స్, ఇటుకలు వంటివి కూడా ఇంటి ముందు ఉంచుకోకూడదు. వాస్తు ప్రకారం, ఇంటి బయట పడి ఉన్న రాళ్ళు జీవితంలో ముందుకు సాగడానికి ఆటంకంగా మారతాయి. అందువల్ల, మీ ఇంటి వెలుపల రాళ్లు ఉంటే వెంటనే తొలగించుకోవాలి.
సంబంధిత కథనం