Vastu Tips | మీ జీవితానికి సింహద్వారం.. ఇత్తడి సింహం ఇంట్లో ఉంటే కలిగే ఫలితాలు!-know the results of keeping brass lion figurine at home according to vastu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know The Results Of Keeping Brass Lion Figurine At Home According To Vastu

Vastu Tips | మీ జీవితానికి సింహద్వారం.. ఇత్తడి సింహం ఇంట్లో ఉంటే కలిగే ఫలితాలు!

HT Telugu Desk HT Telugu
Jul 05, 2022 01:38 PM IST

ఇంట్లో ఇత్తడితో చేసిన సింహం ప్రతిమ ఉంటే ఎంతో శుభప్రదంగా ఉంటుందట. వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి ఫలితాలుంటాయో చూడండి.

Brass Lion in the home
Brass Lion in the home (Unsplash)

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇటీవల కాలంలో ఇళ్ల నిర్మాణాలు కూడా ఎంతో అధునాతనంగా, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. అయితే ఇంటికి ఎంత స్మార్ట్ హోమ్ టెక్నాలజీని ఉపయోగించినా అది వాస్తుపరంగా లేకుండా ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత అనేదే ఉండదు, పనుల్లో పురోగతి ఉండదు, అనేక రకాలుగా నష్టం ఉంటుంది అని నమ్ముతారు.

ఇప్పుడు నిర్మిస్తున్న ఇళ్లు కాకుండా పాత ఇండ్లను గమనిస్తే వాటి తలుపులను దృఢంగా నిర్మిస్తారు, అలాగే తలుపులకు ఇత్తడి ఉపకరణాలు తగిలిస్తారు. సింహ ద్వారం అనిపించేలా ఇత్తడి సింహాల ఆకృతిలో ఒక దిట్టమైన ఉపకరణాన్ని తగిలిస్తారు. నిజానికి ఇదేదో అలంకరణ కోసం తగిలించింది కాదు. దాని వెనక ఎంతో శాస్త్రీయత ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంటికి ఇత్తడి సింహం తగిలించడం శుభప్రదంగా వాస్తుశాస్త్రం చెబుతుంది. దానిని సరైన దిశలో, సరైన మార్గంలో ఉంచినట్లయితే అది ఆ ఇంట్లో ఉండే ప్రజల జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది అంటున్నారు.

ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?

మరి ఇత్తడి సింహాన్ని ఏ దిశలో ఉంచాలి? దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్న మీకు ఉత్పన్నమైనడు దానికి జవాబు ఇక్కడ తెలుసుకోండి.

వాస్తు శాస్త్రాల ప్రకారం చూసుకుంటే.. సింహం శక్తివంతమైనది రారాజుగా చెప్తారు, ఇత్తడి ఒక కఠినమైన లోహం. ఇత్తడి లోహంతో సింహం ప్రతిమను తయారుచేసి దానిని ఇంట్లో ఉంచుకుంటే అది ఎంతో శుభఫలితాలను అందిస్తుంది. ఇందులో దేవతలకు గురువైన బృహస్పతి దేవుడు నివసిస్తాడు. జాతకరీత్యా ఎవరికైతే బృహస్పతి బలంగా ఉంటుందో, వారికి ఈ ఇత్తడి సింహం ద్వారా బలం చేకూరుతుంది. అది ఇంట్లో నివసించే వారిలో విశ్వాసం నింపుతుంది. వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి పురోగతిని తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఇత్తడి సింహాన్ని ప్రధానంగా ఈశాన్య లేదా తూర్పు దిశలో ఇంటికి మధ్య భాగంలో ఉంచుతారు. అలాగే సింహంపై ఎలాంటి దుమ్ము, మట్టి, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్