Ugadi 2023 Scorpio Horoscope । శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలాలు ఇలా ఉన్నాయి!-ugadi 2023 horoscope know yearly astrological predictions in telugu for zodiac sign scorpio ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Ugadi 2023 Horoscope, Know Yearly Astrological Predictions In Telugu For Zodiac Sign Scorpio

Ugadi 2023 Scorpio Horoscope । శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలాలు ఇలా ఉన్నాయి!

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 06:06 AM IST

Ugadi 2023 Scorpio Horoscope : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

Ugadi 2023 Scorpio Horoscope : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి
Ugadi 2023 Scorpio Horoscope : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి (Pixabay)

Ugadi 2023 Scorpio Horoscope : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలాలు

ట్రెండింగ్ వార్తలు

ఆదాయం - 5 వ్యయం - 5 రాజపూజ్యం - 3 అవమానం - 3

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వృశ్చికరాశి వారికి ఫలితములు ఈవిధముగా ఉన్నవి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు వృశ్చికరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి ఆరవ స్థానమునందు సంచరించుటచేత, శని 4వ స్థానము నందు సంచరించుటచేత, రాహువు శత్రు స్థానమగు 6వ స్థానముయందు సంచరించుట చేత మరియు కేతువు 12వ స్థానమునందు సంచరించుట చేత వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరంలో మధ్యస్తము నుండి చెడు ఫలితములు అధికముగా ఉన్నవి.

వృశ్చికరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అర్ధాష్టమ శని ప్రభావం చేత కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్య వ్యవహారాలు మరియు వృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు అధికమగును. శత్రుస్థానమునందు బృహస్పతి ప్రభావంచేత పనుల యందు చికాకులు, ఆటంకములు, గొడవలు మరియు శత్రుత్వం ఏర్పడును. 6వ స్థానమునందు రాహువు వ్యయస్థానమునందు కేతువు ప్రభావం చేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీయొక్క శక్తితో, తెలివితో విజయం వైపు దూసుకు వెళ్ళెదరు. మొత్తంమీద శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి మధ్యస్తము నుండి చెడు ఫలితములు కనబడుతున్నవి. ఆరోగ్య విషయాలయందు, కుటుంబ వ్యవహారములయందు జాగ్రత్త వహించడం మంచిది.

వృశ్చిక రాశివారికి ఉద్యోగస్తులకు మధ్యస్త సమయం. ఉద్యోగమునందు చికాకులు, సమస్యలు శృత్వత్వం అధికమగును. ఉద్యోగమునందు అలసట వహించడం వంటివి పనుల వలన ఇబ్బందులు పడతారు. వృశ్చికరాశి వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. వ్యాపారంలో ఖర్చులు అధికమవ్వడం, అప్పులు పెరగడం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటం వంటివి జరుగును. వృశ్చిక రాశి విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. విద్యార్థులకు మధ్యస్తముగా ఉండబోతున్నది. వృశ్చికరాశి స్త్రీలు ఆరోగ్య విషయమందు జాగ్రత్తపడాలి. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు మరియు కుటుంబ సమస్యలు అధికముగా ఉండును. వృశ్చికరాశి సినీరంగం వారికి అంత అనుకూలంగా లేదు.

వృశ్చిక రాశి రైతాంగములో ఉన్నవారికి మధ్యస్త ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వృశ్చికరాశి వారు సంవత్సరంలో మధ్యస్తమునుడి చెడు ఫలితాలు పొందెదరు. ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహరాల్లో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు ఈ సంవత్సరం పొందాలనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం. వృశ్చికరాశివారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి, దత్తాత్రేయుని స్తోత్రాలను పఠించాలి అని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వృశ్చిక రాశి మాసవారి ఫలితములు

ఏప్రిల్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల్లో అభివృద్ధి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. శ్రేయోభిలాషులను పొందుతారు. పిల్లల సహాయపడతారు.

మే :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. పిల్లల విషయాల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

జూన్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలం.

జూలై :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. చేసే ప్రయత్నాలకు అనుగుణంగా ఆదాయం కూడా పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సూచన.

ఆగస్టు :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఒత్తిడిని అధిగమిస్తారు.

సెప్టెంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత. దూరప్రాంతంలో భూమిని కొనుగోలు చేస్తారు.

అక్టోబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. దేవతానుగ్రహం వలన ధనధాన్య లాభములు. గృహమున మంగళ తోరణములు. భూ గృహ స్థిరాస్తుల వృద్ధి. సంతోషకరమైన వాతావరణము. మృష్టాన్న భోజనము.

నవంబర్ :- ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. నిద్రలేమి వలన అనారోగ్య సమస్యలు. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు.

డిసెంబర్: -ఈ మాసం మీకు మధ్యస్తము నుండి అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధి. మీ స్నేహితులు, సహోద్యోగుల నుండి ప్రశంసలు. గృహమున శుభ కార్యములు. మీ తోబుట్టువుల ఆరోగ్యం జాగ్రత్త. కమ్యూనికేషన్ లాభదాయకము.

జనవరి : - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వినోదం మరియు వ్యాపారంలో వృద్ధిని పెంచుతుంది. ఆర్ధికంగా లాభదాయకం. సమాజంలో అరుదైన గౌరవం కలుగుతుంది. పోటీలలో విజయం సాధిస్తారు.

ఫిబ్రవరి : - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అనుకూలించును. వివాహ అవకాశాలు. సంపద వృద్ధి. విద్యలో విజయం. ఆనందముగా గడుపుతారు.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం