Turmeric: సంపదని ఆకర్షించేందుకు పసుపుతో ఇలా చేయండి
Turmeric: ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆదాయం పెరగాలంటే పసుపుతో ఈ పరిహారాలు చేసి చూడండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.
Turmeric: ప్రతి ఒక్కరి కిచెన్ లో కనిపించే పదార్థం పసుపు. వంటల దగ్గర నుంచి పూజ వరకు పసుపు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సంపదని ఆకర్షించడానికి, ప్రతికూల శక్తుల్ని తొలగించేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ప్రాముఖ్యతని సంతరించుకుంది.
వివిధ సంస్కృతుల్లో పసుపు స్వచ్చత, శ్రేయస్సు, సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. దీని బంగారు రంగు సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది. జీవితం, సమృద్ధికి సార్వత్రిక చిహ్నం. పసుపుని వంటకు మాత్రమే కాకుండా ఆచారాలు, వేడుకలు, ఇంటి నివారణలలో శ్రేయస్సుని ఆహ్వానించేందుకు, ప్రతికూల శక్తులని దూరం చేసేందుకు ఉపయోగిస్తారు. పసుపు అనేది అల్లం కుటుంబానికి చెందిన కర్కుమా లాంగా మొక్క మూలం నుంచి తీసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్కృతులలో శుభానికి చిహ్నంగా భావిస్తారు. పసుపుతో ఇలా చేయడం వల్ల మీ ఇంటి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ఆర్థిక శ్రేయస్సు కోసం
పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రంలో పసుపు ముద్దని కట్టి డబ్బు నిల్వ చేసే లాకర్ లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బు ఆదా చేయడంలో ఇబ్బందులు లేదా అనవసరమైన ఖర్చుల వల్ల చేతిలో డబ్బు నిలవకపోయిన ఈ పరిహారం పాటించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. శక్తివంతమైన పసుపు రంగు శ్రేయస్సుకు ప్రతీక. సంపదని కూడబెట్టుకోవడానికి, నూతన ఆదాయ మార్గాలు తెరుచుకునేందుకు సహాయపడుతుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
సంపదకి అధిపతి లక్ష్మీదేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే సంపద పెరుగుతుంది. వాస్తు పద్దతులలో పవిత్రమైన స్వస్తిక్ చిహ్నం పసుపులో చేయడం వల్ల సంపద, శ్రేయస్సుని అందించే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. పాత ఇంటి నుంచి కొత్త ఇంట్లోకి మారినప్పుడు ఇంట్లో సానుకూల శక్తులని ఆకర్షించేందుకు స్వస్తిక్ చిహ్నాన్ని సరైన దిశలో వేయాలి. అప్పుడే ఆ ఇంటికి ఉన్న ఎటువంటి వాస్తు దోషాలు అయినా తొలగిస్తుందని నమ్ముతారు.
సానుకూల శక్తి కోసం పసుపు నీరు
ప్రధాన ద్వారం చుట్టూ పసుపు నీటిని చల్లడం అనేది ఇంట్లోకి సానుకూల శక్తులని ఆకర్షించేందుకు ఉపయోగించే ఒక ప్రసిద్ధి వాస్తు నివారణ. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సుకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తుందని నమ్ముతారు. ఈ పరిహారం శక్తిని మరింత పెంచేందుకు పసుపు నీటిలో ఒక నాణెం వేసుకుని ఇంటి ఆలయంలో ఉంచితే సంపద రాకకి ఎటువంటి ఆటంకాలు ఉండవు. పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. ఇంటిని శుభ్రపరుస్తుంది. అందుకే పూజ చేసే ముందుగా చాలా మంది ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరిస్తారు.