సెప్టెంబర్ 15, నేటి రాశి ఫలాలు- వీరికి సమాజంలో పేరు, ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి-today sunday september 15th rasi phalalu check mesham to meenam results for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 15, నేటి రాశి ఫలాలు- వీరికి సమాజంలో పేరు, ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి

సెప్టెంబర్ 15, నేటి రాశి ఫలాలు- వీరికి సమాజంలో పేరు, ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి

HT Telugu Desk HT Telugu
Sep 15, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ15.09.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 15 నేటి రాశి ఫలాలు
సెప్టెంబర్ 15 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 15.09.2024

వారం: ఆదివారం, తిథి : ద్వాద‌శి,

నక్షత్రం: శ్రవ‌ణ‌ము, మాసం : భాద్ర‌ప‌ద‌,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయణం

మేషం

నూత‌న‌ కార్యక్రమాలు చేపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఎంత‌గానో పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్ట సుఖాలు వివ‌రిస్తారు. రుణాలు చాలా వరకూ తీరుస్తారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు ఎక్కువ అవుతాయి. రాజకీయ, పారిశ్రామివర్గాలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావ‌చ్చు. బంధువులతో తగాదాలు ఉన్నాయి. కాస్త జాగ్ర‌త్త వ‌హించండి. హనుమాన్ చాలీసా పఠించండి.

వృషభం

ఆర్థికంగా అనుకూలమైన సమయం న‌డుస్తోంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు సంతృప్తి ఇస్తాయి. వ్యాపారులు మరింత లాభాలు దక్కించుకుంటారు. విస్తరణ యత్నాలలో పురోగతి. ఉద్యోగులకు సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలం అవుతాయి. రచయితలు, క్రీడా కారులకు నూతనోత్సాహం ల‌భిస్తుంది. ఆస్తి వివాదాలు ఉండే అవ‌కాశం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు చేప‌డ‌తారు. రచయితలు, క్రీడాకారులకు ఊరట లభిస్తుంది. అనారోగ్య సమ‌స్య‌లు ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది. కుటుంబంలో సమస్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం

నిర్ణయాలలో మరింత నిదానం పాటించండి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలు, కళాకారులు, రచయితలకు అవకాశాలు నిరాశ ప‌రుస్తాయి. శుభవార్తలు వింటారు. వాహనయోగం ఉంది. నూతన పరి చయాలు ఏర్ప‌డ‌తాయి. కనకధారా స్తోత్రాలు పఠించండి.

సింహం

సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫ‌లిస్తాయి. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు ద‌క్కవ‌చ్చు. కళాకారులు, పరిశోధకులకు కాస్త ఊరట ల‌భిస్తుంది. బంధువులతో వివాదాలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య

కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబంలో మీదే పైచేయి అవుతుంది. విద్యార్థులకు కాస్త అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వాహనాలు, భూముల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామిక, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని విష‌యాల్లో మానసిక ఆందోళన చెందుతారు. విష్ణుధ్యానం చేయండి. మంచి జ‌రుగుతుంది.

తుల

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. విద్యార్థులు కొంత ఊరట చెందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు ద‌క్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. రాజకీయ వేత్తలు, కళాకారులకు గందరగోళం కాస్త తొలగుతుంది. శారీరక రుగ్మతలు తొల‌గుతాయి. స్నేహితులతో తగాదాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం

శ్రేయోభిలాషులు మీకు చేదోడుగా నిలుస్తారు. గృహం, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహంతో అడుగు ముందుకు వేస్తారు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు కాస్త ఊరట ల‌భిస్తుంది. అనుకోని ఖర్చులు ఉండొచ్చు. దేవీఖడ్గమాల పఠించండి.

ధనుస్సు

అనుకోని విధంగా ఆదాయం మెరుగు పడుతుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉండవచ్చు. రచయితలు, పరిశోధకులకు కొత్త ఆశలు. శారీరక రుగ్మతలు ఎక్కువ‌య్యే సూచన‌లు ఉన్నాయి. బంధువులతో తగాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం

ఉత్సాహంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీకు తోడుగా నిలిచి సహకరిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం ల‌భిస్తుంది. రాజకీయ, పారిశ్రామికవర్గాలు, రచయితలు అనుకున్న విజయాలు సాధిస్తారు. బంధువిరోధాలు ఉండే అవ‌కాశం ఉంది. ఆరోగ్యభంగం అయ్యే సూచ‌న‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాల కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు కొంత పెరిగినా సమర్థతను యత్నాలు సఫలం అవుతాయి. కొత్త పెట్టుబడులు సమకూర చాటుకుంటారు. అనుకోని ఖర్చులు ఉన్నాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండొచ్చు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు వింటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసి వస్తాయి. బంధువులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఖర్చులు అధిక‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ