మార్చి 15, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు వ్యక్తిగత విషయాలు ఎవరితో పంచుకోవద్దు-today march 15th rasi phalalu in telugu check your zodiac signs result for future prediction ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today March 15th Rasi Phalalu In Telugu Check Your Zodiac Sign's Result For Future Prediction

మార్చి 15, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు వ్యక్తిగత విషయాలు ఎవరితో పంచుకోవద్దు

HT Telugu Desk HT Telugu
Mar 15, 2024 12:04 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ15.03.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 15 నేటి రాశి ఫలాలు
మార్చి 15 నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 15.03. 2024

ట్రెండింగ్ వార్తలు

వారం: శుక్రవారం, తిథి : షష్టి

నక్షత్రం : కృత్తిక, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతీ పని సత్ఫలితాలనిస్తాయి. అవకాశాలు కలసివస్తాయి. గత ఇబ్బందులను దూరం చేసుకుంటారు. కుటుంబసభ్యుల సహాయ సహకారాలుంటాయి. ఖర్చులు అధికమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికిఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూలం. కొన్ని రహస్యాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త పాటించండి. చెల్లింపులు పూర్తి చేసుకుంటారు. బద్దకాన్ని దూరం పెడితే అన్ని విషయాలలో విజయం సాధిస్తారు. శ్రీశంకరాచార్య విరచిత కనకధార స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు, సహకారాలు తీసుకోగలుగుతారు. విదేశీయాన ప్రయాణాలు కలసివచ్చును. విద్యార్థులకు అనుకూల సమయం. స్థిరాస్తి వ్యవహారాలను చేపట్టకండి. ప్రణాళికలు లేకుండా పనులలో చేపట్టకండి. అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోరాదు. బంధుమిత్రులతో వాగ్వివిషయాలుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడికి, కోపానికి దూరంగా ఉండాలి. ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతుంది. విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

సింహ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అధికారిక పదవులు ఏర్పడతాయి. సొంత వాహన ఉపయోగాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ముందు జాగ్రత్తలు అవసరం. ఆలోచనా విధానంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. విద్యార్థులు టార్గెట్లు పెట్టుకొని ప్రయత్నించాలి. అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టంది. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్చించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు బాధ్యతలు, పని ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ ఆలోచనలతోను, మాటలతోను ఇతరులను ఒత్తిడికి గురిచేయు సూచనలున్నాయి. సంతానపరంగా కొన్ని వ్యవహారాలు చికాకునిస్తాయి. పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేసుకోవాలి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అవకాశాలు కలసివస్తాయి. కుటుంబవ్యక్తులచే సహకారాలుంటాయి. అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. అధికారిక హోదాలు వంటివి ఏర్పడతాయి. ఇతరులకు సహకరించుటకు ముందడుగు వేస్తారు. అనుమతులు, ఒప్పందాలతో బిజీగా ఉంటారు. లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి దిన ఫలాలు
వృశ్చిక రాశి దిన ఫలాలు (Pixabay)

వృశ్చికరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండేటట్లు జాగ్రత్తపడండి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతగా వ్యహరించలేకపోతారు. వ్యాపారాల్లో చెల్లింపులకు ముందు జాగ్రత్తలు అవసరం. పెట్టుబడులు మీకనుకూలమైనవిగా ఉండేటట్లు చూసుకోండి. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్జాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్చించండి. పశువులకు బెల్లం, తీపిపదార్జాలను ఆహారంగా పెట్టడం మంచిది.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ శ్రమకు తగిన ప్రయోజనాలు అందక చికాకు పొందు సూచనలున్నాయి. ముఖ్యమనుకున్న పనులు కొన్ని వాయిదాపడతాయి. ఉద్యోగాల్లో చిన్న తరహా గుర్తింపులు ఏర్పచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నూతన వ్యక్తుల పరిచయాలేర్పడతాయి. దీర్ఘకాలిక రుణాలు కొన్నింటిని తీర్చగలుగుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. మీశక్తిని అనుసరించి పనులను చేపట్టుకుంటారు. వ్యాపారాల్లో భాగస్వామ్యయుతంగా వ్యవహరించుకోగలరు. సంతానపరంగా అనుకూలం. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని శుభవార్తలున్నా ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనవలసి రావచ్చు. అధికారుల మద్దతును పొందగలుగుతారు. వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులుంటాయి. వాహన, యంత్రాదుల మరమ్మతులుంటాయి. తల్లిదండ్రులు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు టార్గెట్‌ విధానాలు పాటించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధార స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడులుంటాయి. సహోద్యోగులనుండి సహకారాలు ఉంటాయి. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. చెల్లింపులు పూర్తిచేసుకుంటారు. రావలసినవి వసూలు చేసుకుంటారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel