జులై 18, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ18.07.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 18.07.2024
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
వారం: గురువారం, తిథి : ద్వాదశి,
నక్షత్రం: జ్యేష్ఠ, మాసం : ఆషాఢము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఊహించనివిధంగా పరిచయాలు ఏర్పడతాయి. తగిన ప్రయోజనాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారాభివృద్ధి ఆసక్తి ఏర్పడుతుంది. వాహనాల విషయంలో స్వల్ప జాగ్రత్తలు తప్పనిసరి.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రవర్తనతో కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. బంధు మిత్రులకు సాయం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మిథున రాశి
శ్రమ అధికమైనప్పటికీ ఉత్సాహంగా ఉంటారు. కార్యాచరణలో పెట్టలేని ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యతనీయండి. ఖర్చులు ఎక్కువగా ఉంటున్నా ప్రయోజనాలు పొందుతారు. ఇతరుల వ్యవహారాల కంటే సొంత పనులకే ఎక్కువ సమయం కేటాయించుకోండి.
కర్కాటక రాశి
ఉత్సాహంగా ఉంటారు. అవకాశాలు కలసి వస్తాయి. భూ, గృహ ఏర్పాట్లకు యోచనలు చేసుకొంటారు. పెట్టుబడులు పెడతారు. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బదిలీ ప్రయత్నాలు సుఖాంతమవుతాయి. వివాదాల్లో తెలివిగా వ్యవహరించండి. ఖర్చులెక్కువయ్యే అవకాశం ఉంది.
సింహ రాశి
గ్రహసంచారం మిశ్రమంగా ఉంది. శ్రమ, పట్టుదలతోనే పనులు పూర్తి అవుతాయి. ఇతరుల సాయం కోసం ఆశపడకండి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. విద్యార్థులు అనుకొన్న అవకాశాలు అందుకుంటారు.
కన్యా రాశి
పలుకుబడిగలవారితో పరిచయాలుంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒంటరితనపు భావనలుండే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో బదిలీలు, ప్రదేశ మార్పులు వంటివి ఉంటాయి. ఉపాధి, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
తులా రాశి
ఆర్థికంగా కొంత నిరాశకరంగా ఉంటుంది. ప్రణాళిక లేకుండా ఏ పనీ చేయొద్దు. ఇంటా బయటా వివాదాలుంటాయి. విశ్రాంతి లోపం ఉండకుండా జాగ్రత్తలు పాటించటం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగం అవుతారు. ప్రయాణాలు సొంత వాహనాలపై తగ్గించండి.
వృశ్చిక రాశి
ఉత్సాహకరంగా సాగుతుంది. అవకాశాలు కలసివస్తాయి. ఇచ్చిన డబ్బు సమయానికి అందుతుంది. అధికారులతో సంయమనాలు తప్పనిసరి చేయండి. వ్యాపారంలో పెట్టుబడులు ఉంచుతారు. కోరుకొన్న చోటికి బదిలీలుంటాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సిద్ధిస్తాయి.
ధనుస్సు రాశి
ఊహించిన విధంగా పనుల్ని పూర్తిచేసుకొంటారు. అవరోధాలను అధిగమిస్తూ ప్రయత్నాలను వేగవంతం చేసుకొంటారు. సమయానికి స్పందించలేని స్థితులుంటాయి. వాహనాలు, గృహ ఉపయోగాలు కొనుగోలు చేసుకొంటారు. ఉద్యోగాల్లో అధికారులచే సంతృప్తి పొందలేకపోతారు. వ్యాపార వ్యవహారాల్లో శ్రమచూపి ప్రయోజనాలు పొందుతారు.
మకర రాశి
నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఏర్పరచగలవు. ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. గత వివాదాలను పరిష్కరించుకోగలరు. వ్యాపారుల అంచనాలు ఫలించి నూతన వ్యాపారాలపై దృష్టిపెట్టగలరు. ఉద్యోగ మార్పులు, నూతన ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి.
కుంభ రాశి
సన్నిహితులతో, బంధువర్గంలో ఉన్న వివాదాలు సమర్థించుకోగలరు. ఆర్థికంగా వెసలుబాటుతనం ఏర్పడగలదు. కుటుంబంలో సామరస్యతలకు ప్రాధాన్యతనిచ్చుకోవాలి. అధికారుల సహకారాలుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూస్తారు.
మీన రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వాళ్ళు అన్ని విషయాలలో సరైన అవగాహన, అంచనాలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో నియంత్రణాధోరణి అవసరం. ఆకస్మికమైన ప్రయాణాలు ఉండు సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాశలకు దూరంగా ఉంటూ కర్తవ్యాలను చేపట్టుకోండి. ఒత్తిడులు, నష్టములు వంటివి ఎదుర్కోవలసిరావచ్చు. సంతానంచే ఉత్సాహాలు సిద్ధించగలవు.