Naimisharanyam: ఇంకా కలియుగంలోకి అడుగుపెట్టని గ్రామం, ఇది మనదేశంలోనే ఉంది-this unique village is not enter to kali yugam yet ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Naimisharanyam: ఇంకా కలియుగంలోకి అడుగుపెట్టని గ్రామం, ఇది మనదేశంలోనే ఉంది

Naimisharanyam: ఇంకా కలియుగంలోకి అడుగుపెట్టని గ్రామం, ఇది మనదేశంలోనే ఉంది

Gunti Soundarya HT Telugu
May 30, 2024 06:20 PM IST

Naimisharanyam: ప్రస్తుతం కలిగయుగం నడుస్తోంది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఓ గ్రామం మాత్రం ఇంకా కలియుగంలోకి అడుగుపెట్టలేదు. అది ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది.

నైమిశారణ్యంలోని చక్రతీర్థం
నైమిశారణ్యంలోని చక్రతీర్థం (wikimedia)

Naimisharanyam: పురాణాల ప్రకారం నాలుగు యుగాలు ఉన్నాయి. సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం. మూడు యుగాలు ముగిసిపోయి ఇప్పుడు నాలుగో యుగమైన కలియుగం నడుస్తోంది. 

సత్య యుగాన్ని స్వర్ణ యుగం అంటారు. సత్యం ధర్మం పరిపూర్ణత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చింది త్రేతా యుగం. ఈ యుగంలో ధర్మం ఒక కాలు పోగొట్టుకుందని పుణ్యం తగ్గిపోయిందని ఆ ధర్మం పెరిగిందని చెబుతారు. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ధర్మం ఇప్పుడు నాలుగు కాళ్లకు బదులుగా రెండు కాళ్లపై మాత్రమే నిలబడి ఉంది. సత్యం, ధర్మం క్షీణించడం మొదలైంది. నిజాయితీ తగ్గిపోయింది. ప్రతికూల లక్షణాలు పెరిగిపోయాయి. అందరిలో స్వార్థం అనే భావన ఎక్కువగా ఉండిపోయింది. 

ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. కలియుగాన్ని చీకటియుగమని అంటారు.  సంఘర్షణలు, అసమ్మతి, నైతిక క్షీణిత యుగంగా వర్ణించబడింది. ఈ యుగానికి రాక్షసుడు కాళీ పేరు పెట్టారు. కలియుగంలో విలువలో నైతికత ఆధ్యాత్మికత క్షీణించడం జరుగుతుందని పురాణాల్లోనే చెప్పారు. భౌతిక కోరికల మీదే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మానవత్వాన్ని మరిచిపోయి మోసం వంచనపై ఆధారపడతారు. ఆధ్యాత్మిక అభ్యాసాలు పూర్తిగా మర్చిపోతారు. నిజమైన జ్ఞానం పొందాలని ఎవరికీ అనిపించదని పురాణాలు కలియుగం గురించి పేర్కొన్నాయి. 

కలియుగం ఎందుకు అత్యంత భయంకరమైనది?

కలియుగంలో జీవించడానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే కలియుగం ముగింపును సూచిస్తుంది. ఈ కలియుగంలోనే విష్ణువు పదవ అవతారమైన కల్కి అవతారం ఎత్తుతాడని చెబుతారు. ఈ యుగంలో అవినీతి ఎక్కువగా ఉంటుంది. దేవుడిని విస్మరిస్తారు. హిందూ గ్రంధాలు ఇతిహాసాలు కూడా కలియుగం యుద్ధం సంభాషణలతో నిండి ఉంటుందని చెబుతున్నాయి. 

అధ్యాత్మికతకు పుట్టినిల్లు నైమిశారణ్యం 

అయితే అందరూ కలియుగంలో ఉన్న ఇప్పటికి కలియుగం ప్రవేశించని పట్టణం ఒకటి ఉంది. అది ఎక్కడో కాదు భారతదేశంలోనే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ఉన్న గ్రామమే నైమిశారణ్యం. ఇది ప్రత్యేకమైన పవిత్రమైన గ్రామం. కలియుగం ప్రతికూల ప్రభావాలు నుంచి విముక్తి పొందిన గ్రామంగా నమ్ముతారు. 

నైమిశారణ్యం ఆధ్యాత్మిక మతపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ప్రజలు దేవుని పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారు. రుషులు, సాధువులు తపస్సు చేస్తూ గొప్ప ఆచారాలు పాటించే పురాతనమైన, పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు.  నిజానికి నైమిశారణ్యం సందర్శన లేకుండా ఏ చారధామ్ యాత్ర పూర్తి కాదని చెబుతారు. 

ఈ పట్టణం గురించి చాలా పురాణాలు, కథనాలు, ఇతిహాసాలు ఉన్నాయి. కలియుగం ఇంకా ప్రవేశించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించి ఒక కథ కూడా ప్రాచర్యంలో ఉంది. 

పురాణం ప్రకారం రుషులు సృష్టికర్త అయిన బ్రహ్మను సంప్రదించి అంతరాయాలు లేకుండా ధ్యానం చేసేందుకు ఆధ్యాత్మిక అభ్యాసాలు పూర్తి చేసేందుకు ఒక స్థలాన్ని అడిగారు. బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం నిర్వహిస్తే తాను ఒక చక్రాన్ని విసురుతానని చెప్తాడు. ఆ చక్రం ఎక్కడ ఆగితే అక్కడ ధ్యానం చేసుకోమని బ్రహ్మ సెలవిచ్చాడు. 

అక్కడ అపారమైన శక్తి ఉంటుందని చెప్పారు. ఆ చక్రం నైమిశారణ్యంలో ఆగిపోయింది. అప్పటి నుంచి ఇది ఆధ్యాత్మిక శక్తులకు ఉత్తమమైన ప్రదేశంగా మారింది. మంత్రాలు శ్లోకాలుతో నిత్యం దైవనామస్మరణతో మార్మోగిపోతుంటుంది. ఈ చక్రం వల్ల అక్కడ భూమి చీల్చుకుని ఒక నీటి కొలను ఏర్పడింది. అదే చక్ర తీర్థంగా పిలుస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ చక్ర తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. 

 

Whats_app_banner