Naimishnarayan Temple: మన సనాతన ధర్మంలో అనేక యుగాలు, రామాయణం, మహాభారతం వంటి పురాణ ఇతిహాసములు జరిగినట్లుగా నిరూపించేటటువంటి అనేక పుణ్యక్షేత్రాలు అఖండ భారతావనిలో ఉన్నాయి. అలాంటి పుణ్య క్షేత్రాలలో అయోధ్య, మధుర, ద్వారక, రామేశ్వరం, బదరీనాథ్, కాశీ వంటి క్షేత్రాలు ఎంతటి ప్రాధాన్యతతో కూడి ఉన్నాయి. అటువంటి ఈ పురాణాలు అన్నిటికి పుట్టిల్లు అయినటువంటి నైమిశారణ్యానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నైమిశారణ్యం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు 5 కిలోమీటర్ల దూరంలో, అయోధ్యకు 220 కిమీ దూరంలో ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నైమిశారణ్యం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలం ఏదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో ఒక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యముగా చెప్తారు. ఇక్కడ గోమతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలు వినిపించాడు.
ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు.
సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఈ అరణ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలు ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.