ఈ రాశుల వాళ్ళు ఎదుటి వారి మనసును ఇట్టే చదివేస్తారు- మీ బాధలు పోగొడతారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వాళ్ళు ఎదుటి వారి మనసులో ఏముందో చెప్పకుండానే అర్థం చేసుకోగలుగుతారు. వారి ఫీలింగ్స్ కు అనుగుణంగా నడుచుకుంటారు. ఆ రాశులు ఏవో మీరు చూడండి.
కొందరు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోకుండా వాగుతూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం ఎదుటి వారి మూడ్ ని బట్టి వారితో ప్రవర్తిస్తారు. బాధ, సంతోషం, దుఃఖం ఏదైన సరే మనసులో ఉన్న విషయాన్ని ఇట్టే కనిపెట్టేస్తారు. వారి ఆలోచనలకు తగినట్టుగా నడుచుకుంటారు. నిజమైన స్నేహితులుగా ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటి రాశులు కొన్ని ఉన్నాయి. ఎదుటి వారి భావోద్వేగాలను చక్కగా అర్థం చేసుకుని మసులుకుంటారు. వారి భావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఈ రాశుల వాళ్ళు ఉన్నారంటే మీరు అదృష్టవంతులే.
మీన రాశి
మీన రాశి వాళ్ళు సున్నిత స్వభావం కలిగి ఉంటారు. ఎదుటి వారితో సంభాషించేతప్పుడు వాళ్ళు ఎలా ఫీలవుతున్నారనేది చక్కగా అర్థం చేసుకుంటారు. బాధలో ఉన్నారా? ఆనందంలో ఉన్నారా? ఆందోళన చెందుతున్నారా అనేది ఎదుటి వాళ్ళు చెప్పకపోయిన వారికి తెలిసిపోతుంది. స్నేహితులు, జీవిత భాగస్వాములను అర్థం చేసుకుంటారు. వారి మనసులో విషయం చెప్పకపోయిన సరే దానికి అనుగుణంగా నడుచుకోవడంలో వీరి తర్వాత ఎవరైనా ఉంటారు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన వాళ్ళు రక్షణ స్వభావం కలిగి ఉంటారు. తమ పక్క వారికి సంరక్షకులుగా ఉంటారు. అంతర్ దృష్టి ఎక్కువ. ఎవరి మానసిక స్థితి ఏంటి? అలవాట్లలో ఏమైనా మార్పులు వచ్చాయా అనేది ఇట్టే పసిగడతారు. చురుకైన జ్ఞానం వీరి సొంతం. ఇతరులకు ఎప్పుడూ ఉపశమనం కలిగించేందుకు చూస్తారు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మనసులో బాధ కూడా తీరిపోతుంది. వారి బాధను ఎలా పోగొట్టాలో కూడా తెలుసు. ఇతరులను అర్థం చేసుకోవడం, వారితో కనెక్ట్ అవడంలో ముందుంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మక్కువ స్వభావం ఎక్కువ. ఎదుటి వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి వీళ్ళు ఉంటారు. ఎదుటి వారి మనసును ఇట్టే చదువుతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడితే ఈ రాశి వాళ్ళు ఇట్టే గ్రహించగలుగుతారు. మంచి విధేయులుగా ఉంటారు. ఎవరితోనైనా స్నేహం చేస్తే ఎప్పటికీ వారిని వదిలిపెట్టరు.
తులా రాశి
సంబంధాలలో సామరస్యాన్ని, సమతుల్యతను కాపాడటంలో తులా రాశి వాళ్ళు సమర్థవంతులుగా ఉంటారు. మనోహరమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల పట్ల చాలా దయగా ఉంటారు. ఎదుటి వారితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని మెరుగుపరుచుకుంటారు. ఏదైనా ఒక విషయం గురించి అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎదుటి వారి భావోద్వేగాలను చదవడంలో దిట్టలు. ఇతరుల మనసు తీరును బట్టి నడుచుకుంటారు. అంతర్ దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారి అవసరాలకు తగినట్టుగా ప్రవర్తిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్