Friendship zodiac signs: ఏ రాశి వారికి ఏ రాశి వారితో స్నేహం బాగుంటుందో తెలుసా?-do you know which zodiac signs are best friends with ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Friendship Zodiac Signs: ఏ రాశి వారికి ఏ రాశి వారితో స్నేహం బాగుంటుందో తెలుసా?

Friendship zodiac signs: ఏ రాశి వారికి ఏ రాశి వారితో స్నేహం బాగుంటుందో తెలుసా?

Gunti Soundarya HT Telugu

Friendship zodiac signs: స్నేహం అంటే కొన్ని రాశుల వాళ్ళు అధిక ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశి వారికి ఏ రాశి వారితో స్నేహం కుదురుతుందో తెలుసా?

ఏ రాశి వారికి ఏ రాశి వాళ్ళు స్నేహితులు అయితే బాగుంటుంది? (pixabay)

Friendship zodiac signs: జ్యోతిషశాస్త్రంలో ప్రతి రాశిచక్రం దాని స్వంత లక్షణాలు, వ్యక్తిత్వం, బలహీనతలు, బలాలు కలిగి ఉంటుంది. ప్రతి రాశిచక్రం దాని స్వంత పాలక గ్రహాన్ని కలిగి ఉంటుంది. గ్రహాల సంచార ప్రభావం అన్నీ రాశుల మీద ఉంటుంది. గ్రహాల గమనాన్ని బట్టి జాతకాన్ని అంచనా వేయడం ద్వారా వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించవచ్చు.

కొన్ని గ్రహాలు ఒకదానికొకటి స్నేహాన్ని కలిగి ఉన్నట్లే, కొన్ని రాశిచక్ర గుర్తులు కూడా ఒకదానితో ఒకటి బాగా కలిసిపోతాయి. మేషం నుండి మీనం వరకు వ్యక్తుల స్నేహపూర్వక రాశిచక్ర గుర్తుల గురించి తెలుసుకుందాం. ఏ రాశి వాళ్ళు ఏ రాశి వారితో స్నేహం చేస్తే బాగుంటుందో జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ రాశులకు చెందిన వ్యక్తులు స్నేహితులు అయ్యారంటే వాళ్ళకంటే అదృష్టవంతులు మరెవరూ ఉండరు. పన్నెండు రాశులలో ఏ రాశి వారికి ఏ రాశి వాళ్ళు స్నేహితులుగా సెట్ అవుతారో చూద్దాం.

మేష రాశి

పన్నెండు రాశులలో మేష రాశి మొదటిది. ఈ రాశి వాళ్ళు దూకుడు స్వభావంగా ఉంటారు. అటువంటి వారికి కర్కాటకం, సింహం, ధనుస్సు, తులా రాశులు స్నేహపూర్వక రాశిచక్ర గుర్తులుగా పరిగణిస్తారు. మేష రాశి వారు ఈ రాశులతో బాగా కలిసిపోతారు. వీరి స్నేహ బంధం ఎన్నటికీ విడిపోదు.

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి సంపద దాతగా భావించే శుక్రుడు. అటువంటి ఈ రాశి వారికి కన్య, మకర, కుంభ రాశి వారితో మంచి సంబంధాలు ఉంటాయి. ఈ రాశుల వాళ్ళతో వృషభ రాశి వారు చాలా త్వరగా కలిసిపోతారు. ఒకరికొకరు అండగా ఉంటూ స్నేహమంటే ఇదేరా అనేలా కనిపిస్తారు.

మిథున రాశి

మిథున రాశి వారికి మూడు రాశుల వారితో స్నేహం బాగా కుదురుతుంది. కన్య, తుల, కుంభ రాశులతో మంచి స్నేహాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వాళ్ళు స్నేహితులంటే ప్రాణం ఇస్తారు. మిథున రాశి వారితో ఈ రాశుల స్నేహం కలకాలం సంతోషంగా సాగుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కుంభ రాశి వారితో పాటు తుల, మీనం, వృశ్చిక రాశులతో మంచి స్నేహం ఉంటుంది. ఎప్పటికీ తోడుగా నిలుస్తారు.

సింహ రాశి

సింహ రాశి వారు మేషం, వృశ్చికం, ధనుస్సు రాశి వారికి మంచి స్నేహితులు. కష్టసమయాల్లో ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఈ రాశి వారితో స్నేహం ఉంటే ఒంటరితనమో అనిపించదు.

కన్యా రాశి

కన్యా రాశి వారు వృషభం, కుంభం, మకరరాశి వారితో బాగా కలిసిపోతారు. వీరి స్నేహం చూడముచ్చటగా ఉందని అసూయ పడే విధంగా మెలుగుతారు.

తులా రాశి

తుల రాశి వారు కర్కాటక రాశి, మిథున రాశి, కుంభ రాశి వారితో మంచి స్నేహాన్ని కొనసాగిస్తారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి స్నేహపూర్వక రాశిచక్ర గుర్తులు కర్కాటకం, సింహం, మీనం. ఈ రాశుల వారితో వృశ్చిక రాశి వారికి స్నేహం ఎంతో గొప్పగా ఉంటుంది.

ధనుస్సు రాశి

మేషం, మీనం, సింహరాశి వారితో ధనుస్సు రాశివారి స్నేహం చాలా బాగుంటుంది. ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా కూడా వీళ్ళు విడిపోరు.

మకర రాశి

మకర రాశి వారికి వృషభం, కుంభం, కన్యారాశి వారు మంచి స్నేహితులుగా ఉంటారు.

కుంభ రాశి

ఈ రాశికి అధిపతి శని. కుంభ రాశి వారికి మిథున రాశి, కుంభ, వృషభ రాశి వారితో గొప్ప స్నేహం ఉంటుంది.

మీన రాశి

మీనం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు రాశులతో మీ స్నేహం చాలా కాలం పాటు బాగుంటుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.