Sun nakshtra transit: మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు.. వీరికి ఇక శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి-sun enter into mrugasira nakshtram these zodiac signs get golden days ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Nakshtra Transit: మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు.. వీరికి ఇక శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి

Sun nakshtra transit: మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు.. వీరికి ఇక శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి

Gunti Soundarya HT Telugu

Sun nakshtra transit: సూర్యుడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి మారబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి శుభ ఘడియలు రాబోతున్నాయి. అవి ఏ రాశుల వారికి అనేది చూద్దాం.

మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు

Sun nakshtra transit: హిందూ మతంలో సూర్యుడి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. అలాగే సూర్యుడు నక్షత్రాలను మార్చినప్పుడు దాని శుభ, అశుభ ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద పడుతుందని నమ్ముతారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 8 సూర్యుడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూన్ 22 వరకు ఈ నక్షత్రంలో సంచరిస్తాడు. సూర్యుడు నక్షత్రం మారడంతో రోహిణి కార్తె ముగుస్తుంది. ఎండలు తగ్గుముఖం పడతాయని చెబుతారు. శుక్రుడు మృగశిర నక్షత్రంలోకి వచ్చిన మరుసటి రోజే సూర్యుడు కూడా అదే నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. కొందరికి శుభ ఘడియలు వస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పునః ప్రారంభం అవుతాయి. సూర్యుడి నక్షత్ర మార్పుతో ఏయే రాశులు ప్రకాశిస్తాయో తెలుసుకుందాం.

మేష రాశి

సూర్యుడు మృగశిర నక్షత్రానికి వెళ్ళగానే మేష రాశి వారికి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. ప్రతి పనిలో అదృష్టం లభిస్తుంది. సంపద పెరిగే అవకాశం ఉన్నాయి. నూతన ఆదాయ మార్గాలతో ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా అప్రైజల్ అవకాశాలు పెరుగుతాయి. పనులలో ఆటంకాలు తొలగుతాయి. కెరీర్ లో కొత్త విజయాలు సాధిస్తారు. బకాయిలు చెల్లించగలుగుతారు. మీ కలలు నిజంఅవుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వాళ్ళు సూర్యుని నక్షత్రం మార్పు వలన ఎంతో ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవిత సమస్యల నుంచి విముక్తి పొందుతారు. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు నిర్విగ్నంగా పూర్తి చేస్తారు. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. పనుల్లో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త ప్రదేశాలలో స్టార్టప్ ప్రారంభించే అవకాశం ఉంటుంది.

తులా రాశి

సూర్యుడి నక్షత్ర మార్పు తులా రాశి వారికి మేలుకరమైన ప్రయోజనాలు అందిస్తుంది. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగుతాయి. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యాపరమైన పనులు సత్ఫలితాలు ఇస్తాయి. మనసు సంతోషంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీ పనులను ప్రసంసిస్తారు. మీరు మీ జీవితాన్ని భౌతిక సౌకర్యాలతో గడుపుతారు.

వృశ్చిక రాశి

సూర్య భగవానుడి అనుగ్రహంతో వృశ్చిక రాశి వారి ప్రతి పని విజయవంతమవుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు మీకు లాభిస్తాయి. ఆదాయానికి సంబంధించిన వివాదాలు తొలగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఇంట్లోని అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సమస్యలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకస్మా ఉంది.