Shardiya Navratri 2024: నవరాత్రులను హిందువులు చాలా వైభవంగా జరుపుకుంటారు. ఆ తొమ్మిది రోజులూ దుర్గాదేవి అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది శరన్నవరాత్రులు అశ్విని మాసం, పితృ పక్షం ముగిసిన తర్వాత రోజు అంటే అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి.
నవరాత్రుల్లో అష్టమి, నవమి తేదీలకు ఈసారి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున భక్తులు కన్యా పూజ కూడా చేస్తారు. అయితే కొంత మందికి ఈ సంవత్సరం అష్టమి, నవమి ఒకే రోజున జరుపుకుంటారో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నవరాత్రులు 03 అక్టోబర్ 2024న ప్రారంభమై 11 అక్టోబర్ 2024న ముగుస్తాయి. మరుసటి రోజు దసరా పండగ జరుపుకుంటారు. నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
జ్యోతిష్కుడు నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం అష్టమి, నవమి 2024 అక్టోబర్ 10న ఉన్నాయి. ఒకే రోజు అష్టమి, నవమి రావడంతో ఆ రోజున అష్టమి ఉపవాసం పాటించడం నిషిద్ధం. ఎందుకంటే శాస్త్రాల్లో నవమి ఉన్న అష్టమి నాడు ఉపవాసం నిషిద్ధం.
నవరాత్రుల్లో ఎనిమిదో రోజున దుర్గామాత మహాగౌరీ రూపాన్ని పూజిస్తారు. నవరాత్రులలో తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రి దేవిగా పూజిస్తారు. అష్టమి, నవమి తేదీలలో కూడా భక్తులు కన్యా పూజ చేస్తారు. నవరాత్రులలో కన్యను పూజించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
03 అక్టోబర్ 2024- మొదటి రోజు శైలపుత్రి దేవి ఆరాధన
04 అక్టోబర్ 2024-రెండో రోజు బ్రహ్మచారిణి దేవి ఆరాధన
05 అక్టోబర్ 2024- మూడో రోజు చంద్రఘంటా దేవి ఆరాధన
06 అక్టోబర్ 2024- నాల్గవ రోజు కుష్మాండ దేవి ఆరాధన
07 అక్టోబర్ 2024- ఐదో రోజు స్కంద మాత దేవి ఆరాధన
08 అక్టోబర్ 2024- ఆరో రోజు కాత్యాయనీ దేవి ఆరాధన
09 అక్టోబర్ 2024- ఏడో రోజు మా కాళరాత్రి దేవి ఆరాధన
10 అక్టోబర్ 2024- అష్టమి రోజు మాతా మహా గౌరీ దేవి ఆరాధన
11 అక్టోబర్ 2024 - నవమి రోజు మహా సిద్దిధాత్రి దేవి ఆరాధన
దసరా పండుగను 12 అక్టోబరు 2024న జరుపుకుంటారు
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.