Sankranti Rangoli Ideas 2023 : ముగ్గు వేస్తే ఆర్థికంగా కలిసి వస్తుందట.. పురాణాలు ఏమి చెప్తున్నాయంటే..
Sankranti Rangoli Ideas 2023 : అసలు సంక్రాంతి రోజున ముగ్గులు ఎందుకేస్తారో తెలుసా? ముగ్గులకు ‘రంగవల్లిక’ అనే పేరు ఎందుకొచ్చింది? ఈ విషయాలపై ఓ పురాణ కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Sankranti Rangoli Ideas 2023 : సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ రోజును మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెడుతూ ఉంటారు. వాటిని వివిధ రంగులు, పువ్వులు, దీపాలు, గొబ్బెలమ్మతో అలంకరిస్తారు.
శ్రద్ధగా కళ్లాపు చల్లి.. చుక్కల ముగ్గులు లేదా పువ్వుల, డిజైన్ల ముగ్గులు వేసి.. వాటికి రంగులు అద్దుతారు.
కేవలం ముగ్గులే పండుగ శోభను తెచ్చేస్తాయి. అంతేకాదు వివిధ సంస్థలు తమ సంక్రాంతి సమయంలో ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తాయి. వాటి గెలిచేవారికి బహుమతులు అందిస్తారు. అయినా ఇంటి ముందు ముగ్గు వేయగానే ఓ చక్కటి పండుగ శోభ వచ్చేస్తుంది. అందుకే మహిళలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముగ్గులు వేస్తారు. అయితే సంక్రాంతి సమయంలో వేసే రంగవల్లులకు మరో ప్రత్యేకత ఉంది. అసలు ముగ్గులకు ‘రంగవల్లిక’ అనే పేరు ఎందుకొచ్చింది? దీని వెనుక ఓ పురాణ కథ కూడా ఉంది.
ఈ విషయాలపై ఓ పురాణ కథ కూడా ఉంది. అదేంటంటే.. అప్సరసల్లో ఒక్కరైన ఆనంద వల్లికకు.. అందరికంటే తానూ మరింత అంతంగా ఉంటుందనే అసూయతోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె దివి నుంచి భువికి వచ్చి ఇక్కడ ప్రకృతి, సౌందర్యానికి మంత్ర ముగ్ధరాలు అవుతుంది. అదే సమయంలో దగ్గర్లో ఉన్న ఆశ్రమానికి చేరుకుని.. అక్కడ పండ్లు, పూలు కోస్తూ.. వాటిని తొక్కేస్తూ అటు నుంచి ఇటు వెళ్తూ చిందవందర చేస్తుంది. అక్కడే వేధాభ్యసం చేస్తున్న ముని కుమారులకు ఈ చర్యలు భంగం కలిగించాయి.
అయితే వారిలో సుధాముడు అనే ముని కుమారుడు ఆగ్రహంతో ఆనంద వల్లికకు శాపం ఇస్తాడు. పువ్వులను, పండ్లను ఎలా తొక్కుతూ నలిపేస్తున్నావో.. నీ అందం కూడా మా పాదల కింద నలుగుతూ ఉంటుందని శపిస్తాడు. తాను చేసిన తప్పును గ్రహించిన ఆనంద వల్లిక క్షమించమని కోరుతుంది. అయితే శాపాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదని.. పార్వతి దేవి మాత్రమే ఆ శాపానికి ప్రాయిశ్చత్తం చెప్తుందని సూచిస్తాడు.
పార్వతిదేవిని పూజించిన ఆనందవల్లికకు.. ఆ మాతా ప్రత్యక్షమై.. ముని కుమారుని శాపాన్ని వెనక్కి తీసుకోలేమని చెప్తుంది. దానికి ప్రతి ఫలంగా ఏ పూజ చేసినా.. ముందు ముగ్గురూపంలో వేసి.. నీకు పసుపు, కుంకుమలు చెల్లించాకే.. తర్వాత పూజలు జరుగుతాయని తెలిపింది. అలా చేసిన వారికి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండవని పార్వతీదేవి ఆనందవల్లికకు చెప్తుంది. అప్పటి నుంచి ఆనంద వల్లికకు.. రంగవల్లిక అనే పేరు వచ్చింది. అందుకే పండుగల సమయంలో ముగ్గులకు అంత ప్రాముఖ్యతను ఇస్తారు.
సంబంధిత కథనం