Maha shivaratri: ఈ ఐదు రాశుల వారికి 300 ఏళ్ల తర్వాత మహా శివరాత్రి నాడు వచ్చే అద్భుత యోగాల ప్రభావం-maha shivaratri these zodiac signs get auspicious results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Maha Shivaratri These Zodiac Signs Get Auspicious Results

Maha shivaratri: ఈ ఐదు రాశుల వారికి 300 ఏళ్ల తర్వాత మహా శివరాత్రి నాడు వచ్చే అద్భుత యోగాల ప్రభావం

Gunti Soundarya HT Telugu
Mar 02, 2024 01:14 PM IST

Maha shivaratri: సుమారు 300 ఏళ్ల తర్వాత మహా శివరాత్రి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. వాటి ప్రభావం వల్ల అదృష్టం పొందబోతున్న రాశులు ఇవే.

300 ఏళ్ల తర్వాత మహా శివరాత్రి అద్భుత యోగం
300 ఏళ్ల తర్వాత మహా శివరాత్రి అద్భుత యోగం (pixabay)

Maha shivaratri: ఏడాది మహా శివరాత్రి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది. మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్థి రోజున మహా శివరాత్రి జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్సుని మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివరాత్రిని పరిగణిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సంవత్సరం మార్చి 8న మహాశివరాత్రి రోజు అద్భుతమైన యోగాలో కలయిక జరగబోతుంది. సర్వార్థ సిద్ధి యోగం, సిద్ధి యోగం, శివయోగం ఏర్పడనున్నాయి. అలాగే ఆరోజు జరిగే గ్రహాల కలయిక కూడా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. మార్చి 8న కుంభ రాశిలో గ్రహాల రాజు సూర్యుడు, శని, శుక్రుడు కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.

ఇక గ్రహాల రాకుమారుడు బుధుడు మహా శివరాత్రికి ఒకరోజు ముందు మీన రాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఇక అంగారకుడు శనికి చెందిన మకర రాశిలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం దాదాపు 300 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతోంది. ఈ కారణంగా మహాశివరాత్రి రోజు కొన్ని రాశులకు చాలా పవిత్రమైనదిగా ఉంటుంది. ఏయే రాశుల జాతకులు ఈ అదృష్టాన్ని పొందబోతున్నారో తెలుసుకుందాం.

మేష రాశి

మహా శివరాత్రి ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో మేష రాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి. పండుగ ఈ రాశి వారి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ధన లాభం పొందుతారు. విద్యార్థుల పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

వృషభ రాశి

పరమేశ్వరుడి అనుగ్రహంతో మహా శివరాత్రి నాడు చేపట్టిన అన్ని పనుల్లో వృషభ రాశి జాతకులు విజయం సాధిస్తారు. సమాజంలో ప్రతిష్ట, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోజు ఈరాశి జాతకుల జీవితం కీలక మలుపు తిరగబోతుంది. ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి.

తులా రాశి

అనేక యోగాలు, కలయిక గ్రహాల గమనం వల్ల తులా రాశి జాతకులు అద్భుత ప్రయోజనాలు పొందుతారు. మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

మకర రాశి

పరమశివుడి ఆశీస్సులు పొందిన మకర రాశి జాతకులు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కార్యాలయంలో పదోన్నతికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది.

కుంభ రాశి

శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి. శనీశ్వరుడి స్వగృహం ఇది. అందువల్ల కుంభ రాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు ఉంటాయి. శని శివుడికి పరమభక్తుడు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది.

WhatsApp channel