Krodhi nama samvatsram: క్రోధి నామ సంవత్సర ఫలితాలు.. ఏ గ్రహాలు ఎలాంటి పరిస్థితులు కలిగిస్తాయో చూద్దాం-krodhi nama samvatsram results lets see which planets cause what conditions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Krodhi Nama Samvatsram: క్రోధి నామ సంవత్సర ఫలితాలు.. ఏ గ్రహాలు ఎలాంటి పరిస్థితులు కలిగిస్తాయో చూద్దాం

Krodhi nama samvatsram: క్రోధి నామ సంవత్సర ఫలితాలు.. ఏ గ్రహాలు ఎలాంటి పరిస్థితులు కలిగిస్తాయో చూద్దాం

HT Telugu Desk HT Telugu
Apr 09, 2024 07:00 AM IST

Krodhi nama samvatsram: క్రోధి నామ సంవత్సరంలో ఏయే గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు. ఆ వివరాలు మీ కోసం.

క్రోధి నామ సంవత్సర ఫలితాలు
క్రోధి నామ సంవత్సర ఫలితాలు (freepik)

Krodhi nama samvatsram:  క్రోధి సంవత్సరములో రాజులు కామపీడితులు, యుద్దాసక్తులు, అతివృష్టి-అనావృష్టి బాధలు అనుభవించాల్సి వస్తుంది. క్రోధి నామ సంవత్సరం అంటే కోపం అధికంగా ఉంటుంది. 

క్రోధి సంవత్సరము రాజాదులు, ఫలములు

చాంద్రమానం ప్రకారము రాజుగా మంగళ, మంత్రి శని, సేనాధిపతి శని, పూర్వ సస్యాధిపతి మంగళ, అపరసస్యాధిపతి శని, రసాధిపతి గురు, నీరసాధిపతి మంగళ.

ఫలములు

రాజా మంగళ ధన-ధాన్యముల కొరత, యుద్ధభయము, అగ్ని చోర, రోగభయము మంత్రి శని వల్ల వృష్ట్రభావము, ధాన్యనాశము, అగ్నిభయము, రోగబాధ, ప్రజలకు పీడ కలుగుతాయి. 

సేనాధిపతి శని రాజులలో ధర్మలోపము, రాజులలో పరస్పర కలహము, ప్రజలకు పాపకర్మయందు ఆసక్తి ఏర్పడుతుంది.

పూర్వ సస్యాధిపతి మంగళ నీటికి, ధాన్యములకు కొరత, యుద్ధభయము, అగ్ని చోర, రోగభయము కలుగుతుంది .

అపర సస్యాధిపతి శని రాజులకు యుద్ధమందు ఆసక్తి, సంపదకు కొరత, రోగభయము, వృష్టి ధాన్యములకు కొరత ఏర్పడుతుంది. 

ధాన్యాధిపతి చంద్ర సమృద్ధమైన వృష్టి గోధుమ మొదలైన ధాన్యముల సమృద్ధి, ప్రజలకు సుఖము కలుగును. 

శని సామాన్యమైన వృష్టి చోర అగ్ని భయము, అల్పమైన అన్నము.

మేఘాధిపతి శని వృష్టికి కొరత, రాజకోశమందు ధనానికి కొరత, అతియైన శీతబాధ, ధాన్యనాశము, రోగభయము పీడిస్తాయి.

రసాధిపతి గురు బావి, సరోవరములందు నీటికి సమృద్ధి, చెరుకు, బంగారము ఇత్యాది సమృద్ధిగా ఉంటాయి.

నీరసాధిపతి మంగళ రక్తచందనము, రాగి, ప్రవాలము వీటి ధర అధికమవుతుంది.

మేష సంక్రమణ ఫలము

చైత్ర శుక్ష పంచమీ (13-04-2024) శనివారం 42 ఘటికా, 51 పళం రాత్రి రవి నిరయణ మేషసంక్రమణం ఉన్నందువలన దీని ఫలితంగా కలహం జరుగుతుంది.

సూర్య సిద్ధాంతరీత్యా మకర సంక్రమణ ఫలము

పుష్య శుక్ల ప్రతిపత్ (14.01.2024) సూర్యమండలోదయమారభ్య ఘటికా 19 పళ 35 రవి మకరసంక్రమణం బాలవ కరణమందు సంభవిస్తుంది.

గురు, శుక్రుని అస్తోదయాలు

చైత్ర కృష్ణ త్రయోదశి 06-05-2024 పశ్చిమాస్తః గురుః

వైశాఖ కృష్ణ దశమి 01-06-2024 పూర్వోదిత గురుః

చైత్ర కృష్ణ అష్టమి 01-05-2024 పళ్చిమాస్తం శుగ్రః

జ్యేష్ట కృష్ణ సప్తమి 28-06-2024 పూర్వోదితః శుక్రః

ఫాల్గుణ కృష్ణ చతుర్థి18-03-2025 పశ్చిమాస్తః శుక్రః

ఫాల్గుణ కృష్ణ ఏకాదశి 25-03-2025 పూర్వోదితః శుక్రః

 

Whats_app_banner