Rakhi Gifts: మీ రాశి ప్రకారం మీ సోదరసోదరీమణులకు ఏ బహుమతులు ఇవ్వాలో తెలుసుకోండి
Rakhi Gifts: ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి 2024 ఆగస్టు 19న, సోమవారం నిర్వహించుకోనున్నారు. శ్రావణ పూర్ణిమనాడు శోభన్ యోగం, సిద్ధి ఔషధి యోగం ఏర్పడతాయి. వీటితో పాటు గజ కేసరి యోగం, శశ యోగం, లక్ష్మీ నారాయణ యోగం వంటివి రక్షా బంధన్ పండుగను ప్రత్యేకంగా మార్చాయి.
శ్రావణ మాసంలో వచ్చే పెద్ద పండుగల్లో రాఖీ పౌర్ణమి ఒకటి. ఇది ఆగస్టు 19 రోజున నిర్వహించుకుంటున్నారు. శ్రావణ పూర్ణిమ నాడు శోభన్ యోగం, సిద్ధి ఔషధి యోగం ఉంటాయి. వీటితో పాటు శనిగ్రహి, బుద్ధాదిత్య యోగం, గజ కేసరి యోగం, శశ యోగం, లక్ష్మీ నారాయణ యోగం రక్షా బంధన్ పండుగను మరింత ప్రత్యేకం చేశాయి. ఆగస్టు 18, 2024 ఆదివారం రాత్రి 2:21 నిమిషాలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఇది 2024 ఆగస్టు 19 సోమవారం రాత్రి 12:28 గంటల వరకు ఉంటుంది. దీంతో పౌర్ణమి సూర్యోదయం నుంచి రాత్రి 12.28 గంటల వరకు ఉంటుంది.
రాఖీ కట్టేందుకు ముహూర్తం
ఈ ఏడాది సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 1.25 గంటల వరకు భద్ర కాలం ఉంది. ఈ సమయంలో సోదరుడికి రాఖీ కట్టడం మంచిది కాదు. భద్ర కాలం ముగిశాక రాఖీ కడితే మంచిది. అంటే మధ్యాహ్నం 1:40 గంటల నుండి సాయంత్రం 6:25 గంటల వరకు రక్షాబంధన్ కు శుభప్రద సమయంగా చెప్పుకోవచ్చు.
ఏ రాశి ప్రకారం ఏ బహుమతి?
శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున సోదరీమణులకు, సోదరులు కానుకలు తీసుకురావాలి. బహుమతులు ఇద్దరికీ సౌభాగ్యాన్ని, శ్రేయస్సును తెస్తాయని చెబుతారు. సోదరీమణులకు సోదరులు వారి రాశి ప్రకారం ఈ క్రింది బహుమతులు ఇవ్వవచ్చు. మీ సోదరిమణి రాశి ప్రకారం ఆమెకు ఏ బహుమతి ఇవ్వాలో తెలుసుకోండి.
మేషం: వెండి పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు. గులాబీ, ఎరుపు, క్రీమ్ రంగు దుస్తులు.
వృషభం: దుస్తులు, ఆభరణాలు, మిఠాయిలు. క్రీమ్, నీలం, ఆకుపచ్చ దుస్తులు
మిథున రాశి: బంగారు ఆభరణాలు లేదా డబ్బులు. ఆకుపచ్చ, పసుపు క్రీమ్ రంగు దుస్తులు
కర్కాటక రాశి : వెండి ఆభరణాలు, గృహ ఎలక్ట్రానిక్ వస్తువులు, క్రీమ్, ఎరుపు, పసుపు రంగు దుస్తులు.
సింహ రాశి : రాగి పాత్రలు, ఎరుపు, ఆకుపచ్చ దుస్తులు
కన్యారాశి : శ్రీ గణేష్ విగ్రహం, బంగారు ఆభరణాలు, ఆకుపచ్చ, క్రీమ్, పసుపు రంగు దుస్తులు
తుల రాశి: దుస్తులు, కాస్మోటిక్స్, అలంకరణ వస్తువులు, క్రీమ్, నీలం, ఆకుపచ్చ రంగు దుస్తులు
వృశ్చిక రాశి: ఎలక్ట్రానిక్ పరికరాలు, బంగారు ఆభరణాలు, ఎరుపు, పసుపు, ఎరుపు రంగు దుస్తులు
ధనుస్సు : బంగారు ఆభరణాలు, నగదు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగు దుస్తులు
మకరం: దుస్తులు, వాహనాలు, నగదు, నీలం, క్రీమ్, ఆకుపచ్చ రంగు దుస్తులు
కుంభం: సౌందర్య వస్తువులు, పాదరక్షలు, నీలం - క్రీమ్ రంగు దుస్తులు
మీనం : బంగారు ఆభరణాలు, వెండి పాత్రలు, పసుపు -ఎరుపు రంగు దుస్తులు
పైన చెప్పిన ప్రకారం మీ చెల్లి లేదా అక్క ఏ రాశికి చెందినదో వారికి తగ్గ బహుమతులు కొనుక్కుంటే మంచిది. ఇది వారికి ఎంతో మేలు జరుగుతుంది.