Kanya sankranti 2024: కన్యా సంక్రాంతి రోజు ఇలా చేస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి-kanya sankranti is on 16th september sun god is specially worshipped ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kanya Sankranti 2024: కన్యా సంక్రాంతి రోజు ఇలా చేస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి

Kanya sankranti 2024: కన్యా సంక్రాంతి రోజు ఇలా చేస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి

Gunti Soundarya HT Telugu
Sep 14, 2024 05:40 PM IST

Kanya sankranti 2024: సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించడాన్ని కన్యా సంక్రాంతి అంటారు. ఈరోజు దానం, స్నానానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేసే దానాల వల్ల జీవితంలో విజయం సాధించవచ్చు. అనేక సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.

కన్యా సంక్రాంతి ప్రాముఖ్యత
కన్యా సంక్రాంతి ప్రాముఖ్యత

Kanya sankranti 2024: సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం 12 సంక్రాంతి జరుపుకుంటారు. వాటిలో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది మకర సంక్రాంతి. ప్రస్తుతం సింహ రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 

సెప్టెంబర్ 16న సూర్యభగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని కన్యా సంక్రాంతి అంటారు. కన్యా సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ప్రజలు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని స్నానం చేస్తారు. వారి పేరు మీద దానాలు చేస్తారు. ప్రత్యేకంగా పూజలు చేస్తారు. విశ్వకర్మ జన్మదినాన్ని కూడా కన్యా సంక్రాంతి రోజునే జరుపుకుంటారు. అలాగే ఈరోజు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారని నమ్ముతారు. 

ప్రతి సంక్రాంతికి తనదైన ప్రాముఖ్యత ఉంటుంది. కన్యా సంక్రాంతికి కూడా ప్రత్యేకత ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కన్యా సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. కన్యాసంక్రాంతి రోజున సూర్యభగవానుడిని పూర్తి ఆచారాలతో పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. పశ్చిమ బెంగాల్ ప్రజలు కన్యా సంక్రాంతిని లక్ష్మీ పూజగా జరుపుకుంటారు. కన్యా సంక్రాంతి మరుసటి రోజు నుంచి పితృ పక్షం ప్రారంభం అవుతుంది. దీన్నే మహాలయ పక్షాలని కూడా పిలుస్తారు. 

సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు

కన్యా సంక్రాంతి నాడు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్య భగవానుడి అనుగ్రహం పొందిన వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారని, సమాజంలో కీర్తిని పొందుతారని నమ్ముతారు. ఒకరికి ఆరోగ్య దీవెనలు లభిస్తాయి.

ఈ పని చేయండి 

కన్యా సంక్రాంతి రోజున దానధర్మాలు చేయాలి. పెద్దలను గౌరవించండి. వారికి సేవ చేయండి. సంక్రాంతి రోజున నిరుపేదలకు సహాయం చేయడం శుభప్రదం. కన్యా సంక్రాంతి రోజున విధివిధానాలతో పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.

పవిత్ర నదిలో స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది మాత్రమే కాకుండా పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు, తర్పణాలు వదిలే సంప్రదాయం కూడా ఉంది. సూర్య ఆరాధన వల్ల జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది. సూర్యుడి అనుగ్రహం ఉంటే జీవితంలో అపజయం అనేది ఉండదు. అదే బలహీనమైన స్థితిలో ఉంటే మాత్రం ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. 

ఈరోజు ఎరుపు రంగు దుస్తులు, బెల్లం, నెయ్యి, గోధుమలు వంటి వాటిని దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో ఎదుర్కొనే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

విశ్వకర్మ ఆరాధన 

కన్యా సంక్రాంతి రోజున విశ్వకర్మ జన్మదినాన్ని జరుపుకుంటారు. ఈ రోజున విశ్వకర్మను ఆరాధించడం వల్ల పని ప్రాంతంలో మీ సామర్థ్యం పెరుగుతుంది. ఒక వ్యక్తి సంపద, శ్రేయస్సును పొందుతాడు. కన్యాసంక్రాంతి రోజున పూర్వీకులకు దానం, పూజలు, పుణ్యస్నానాలు ఆచరించాలి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

టాపిక్