Jupiter transit: 12ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారి జీవితం మారబోతుంది-jupiter transit in to vrishabha rashi after 12 years these zodiac signs will effect ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: 12ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారి జీవితం మారబోతుంది

Jupiter transit: 12ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారి జీవితం మారబోతుంది

Gunti Soundarya HT Telugu
Mar 18, 2024 09:43 AM IST

Jupiter transit: దేవ గురువు బృహస్పతి తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితం మారబోతుంది. భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. ఉద్యోగ పరంగా లాభపడతారు.

12 ఏళ్ల తర్వాత రాశి మారనున్న గురు గ్రహం
12 ఏళ్ల తర్వాత రాశి మారనున్న గురు గ్రహం

Jupiter transit: దేవ గురు గృహస్పతి సంతోషమైన గ్రహంగా ప్రసిద్ధి చెందింది. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే ఎప్పటికి డబ్బుకు లోటు ఉండదు. గౌరవం పొందుతారు. బృహస్పతి ఆశీర్వాదం ఉంటే జీవితంలో భౌతిక ఆనందాలన్నీ లభిస్తాయి. ఒకవేళ బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే అదృష్టం కలిసిరాదు.  ఆర్థిక నష్టం జరుగుతుంది. పనుల్లో అడ్డంకులు, వివాహాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. 

జ్యోతిష్య శాస్త్రంలో గురువు సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. జ్ఞానం, గురువు, పిల్లలు, విద్యా, ధార్మిక కార్యక్రమాలు, సంపద,  దాతృత్వం, సద్గుణాలు, ఎదుగుదల మొదలైన వాటికి గురు గ్రహాన్ని కారకుడిగా భావిస్తారు. 27 నక్షత్రాలలో పునర్వసు, వైశాఖం, పూర్వ భాద్రపద నక్షత్రాలకు అధిపతిగా వ్యవహరిస్తాడు. జులై 1న బృహస్పతి వృషభ రాశి సంచారం చేయబోతున్నాడు. 

12 సంవత్సరాల తర్వాత దేవ గురువు బృహస్పతి మేష రాశి నుంచి వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. ఈ గ్రహం రాశి మార్పు కొన్ని రాశులకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది. బృహస్పతి రాశి సంచారం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. 

మేష రాశి

గురు సంచారం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తిలో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. న్యాయపరంగా ఎదుర్కొంటున్న కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ బాలెన్స్ పెరుగుతుంది. డబ్బు ఆదా చేయగలుగుతారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు తీర్చే సామర్థ్యం కలిగి ఉంటారు. 

వృషభ రాశి

బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా రాజయోగం ఏర్పడి వృషభ రాశి వారికి అద్భుతమైన పురోగతి విజయాన్ని తెస్తుంది. కెరీర్ అనుకూలమైన విధంగా ఉంటుంది. ప్రమోషన్, కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధన లాభం పొందుతారు. కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు.

మిథున రాశి 

బృహస్పతి రాశి మార్పు మిథున రాశి వారికి శుభదాయకం. ఈ రాశి వారి జీవితంలోని అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలు, భౌతిక సౌకర్యాలతో గడుపుతారు. ఈ సమయంలో పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ఆకస్మికంగా ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి

సింహ రాశి వారికి బహస్పతి సంచారం శుభ ఫలితాలు అందిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు లేదా వేతనాల పెంపు ఉంటుంది. పదోన్నతికి ఉన్నతాధికారులు సహోద్యోగులు సహకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వివాహిత వ్యక్తులు తమ భాగస్వామితో రొమాంటిక్ ట్రిక్ ప్లాన్ చేసుకోవడానికి శుభ సమయం.

కన్యా రాశి 

బృహస్పతి సంచారం వల్ల విద్యా, వృత్తిలో విజయాన్ని సాధిస్తారు. వేతన జీవులు  ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ పొందుతారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనుకూల ఫలితాలు పొందుతారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులు గురు సంచారం నుండి అనుకూల ప్రభావాలు అనుభవిస్తారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరగడంతో వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక అభివృద్ధి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి.