Jupiter transit: బృహస్పతి సంచారం- నవంబర్ తర్వాత ఈ రాశి వారి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కబోతుంది-jupiter enter rohini nakshtram in november 2024 these zodiac signs are unveiling fortunate ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: బృహస్పతి సంచారం- నవంబర్ తర్వాత ఈ రాశి వారి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కబోతుంది

Jupiter transit: బృహస్పతి సంచారం- నవంబర్ తర్వాత ఈ రాశి వారి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కబోతుంది

Gunti Soundarya HT Telugu
Sep 20, 2024 12:00 PM IST

Jupiter transit: బృహస్పతి ప్రస్తుతం మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. నవంబర్ నెలాఖరులో రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది మూడు రాశుల వారికి అనుకూలమైన కాలంగా మారుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది.

బృహస్పతి సంచారం
బృహస్పతి సంచారం

Jupiter transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శుభకరమైన గ్రహంగా దేవగురువు బృహస్పతిని భావిస్తారు. గురు గ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా కీలకంగా ఉంటుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం జరుగుతోంది.

ప్రస్తుతం బృహస్పతి మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. నవంబర్ వరకు ఇదే నక్షత్రంలో ఉంటారు. అనంతరం తన నక్షత్ర స్థితిని మార్చుకుని రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. 28 నవంబర్ 2024న రోహిణి నక్షత్రంలో మధ్యాహ్నం 01:10 గంటలకు బృహస్పతి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రంలో బృహస్పతి రాక అన్ని రాశుల వారి జీవితాల్లో హెచ్చు తగ్గులకు దారి తీస్తుంది. అయితే కొన్ని రాశుల వాళ్ళు ఈ కాలంలో భారీ లాభాలను పొందే అవకాశం ఉంది.

రోహిణి నక్షత్రం

కేతువు రోహిణి నక్షత్రానికి అధిపతి. ఇది ఎద్దుల బండి లేదా రథం వలె కనిపిస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా సన్నగా, ఆకర్షణీయంగా ఉంటారు. అందమైన కళ్ళు, మనోహరమైన చిరునవ్వు కూడా కలిగి ఉంటారు. ప్రకృతి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. ఇతరులతో చాలా వినయంగా, మర్యాదగా ప్రవరిస్తారు. ముక్కుసూటి మనస్తత్వం వీరిది. ఎక్కువగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం ఏ రాశులకు మేలు చేస్తుందో చూద్దాం.

వృషభ రాశి

బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. జీవితంలోని వివిధ రంగాలలో విజయం సాధిస్తారు. కృషి పట్టుదలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను ఈ కాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుండటం వల్ల విరాళాలు ఇస్తారు. ఈ సమయంలో ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి

బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితాల్లో శుభ ఫలితాలను తెస్తుంది. అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది. నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. ఆదాయ స్థాయిలలో వేగవంతమైన పెరుగుదలను చూస్తారు. ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. పనికి ప్రశంసలు దక్కుతాయి. గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్యం గురించి ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. కష్టసమయంలో సోదర, సోదరీమణులు అండగా నిలుస్తారు.

వృశ్చిక రాశి

రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో వెంటాడుతున్న ఓ సమస్య ఇప్పుడు తొలగిపోతుంది. వ్యాపారుల కష్టాలు తీరిపోయి కొత్త పంథాలో పయనిస్తారు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలను చేసుకుంటారు. లాభాలు సంపాదించుకునేందుకు ఇది మంచి కాలం. ధైర్యం పెరుగుతుంది. కార్యాలయంలో మీ స్థానం మెరుగుపడుతుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.