krishnashtami 2024: జన్మాష్టమి రోజు లడ్డూ గోపాల్ ను ఈ పద్ధతి ప్రకారం పూజించండి-janmashtami 2024 how is laddu gopal worshipped puja vidhanm chanting mantras ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Krishnashtami 2024: జన్మాష్టమి రోజు లడ్డూ గోపాల్ ను ఈ పద్ధతి ప్రకారం పూజించండి

krishnashtami 2024: జన్మాష్టమి రోజు లడ్డూ గోపాల్ ను ఈ పద్ధతి ప్రకారం పూజించండి

Gunti Soundarya HT Telugu
Aug 23, 2024 06:29 PM IST

krishnashtami 2024: దృక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం ఆగస్ట్ 26న జన్మాష్టమి జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి. కృష్ణుడి బాల రూపాన్ని ఈరోజు పూజిస్తారు.

లడ్డూ గోపాల్ ని ఇలా పూజించండి
లడ్డూ గోపాల్ ని ఇలా పూజించండి

krishnashtami 2024: హిందూ మతంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని బహుళ శుక్ల అష్టమి తేదీన శ్రీకృష్ణుని జన్మదినోత్సవం జరుపుకుంటారు. దీనిని శ్రీ కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని లడ్డూ గోపాల్ రూపాన్ని ఆచారాల ప్రకారం, సరైన పద్ధతిలో పూజించడం ద్వారా భగవంతుడు ప్రసన్నుడై తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని మత విశ్వాసం. 

జ్యోతిషశాస్త్రంలో శ్రీ కృష్ణుడు విష్ణువు ఎనిమిదవ అవతారంగా పరిగణిస్తారు. రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ద్వాపర కాలంలో కృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి సమయం ఉందో ఈ ఏడాది జన్మాష్టమి రోజు కూడా అలాగే వచ్చింది. ఈరోజున వృషభ రాశిలో రోహిణి నక్షత్రం, చంద్రుడు ఉండటం ఎంతో శుభప్రదం. జన్మాష్టమి సోమ, బుధ వారాల్లో రావడం చాలా అరుదుగా జరిగే యాదృశ్చికం. ఈ ఏడాది సోమవారం జన్మాష్టమి వచ్చింది. దీన్ని జయంతి యోగం అంటారు.

కృష్ణాష్టమి రోజు పూజ చేసేందుకు మూడు పవిత్రమైన సమయాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు. వీటిలో ఆరాధన చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఉదయం. 5.56 గంటల నుంచి 7.37 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. ఈ సమయం పూజకు అనువైనది. జన్మాష్టమి శుభ సమయం, పూజా విధానం, మంత్రం తెలుసుకుందాం.

జన్మాష్టమి ఎప్పుడు?

దృక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం శ్రావణ మాసం అష్టమి తిథి 26 ఆగస్ట్ 2024 ఉదయం 03:39 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 27 ఆగస్టు 2024 తెల్లవారుజామున 02:19 గంటలకు ముగుస్తుంది.

శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజ ముహూర్తం

శ్రీ కృష్ణ భగవానుడి 5251వ జయంతి సందర్భంగా 26 ఆగస్ట్ 2024న మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 12:44 గంటల వరకు పూజలకు అనుకూలమైన సమయం. కృష్ణుడు అర్థరాత్రి జన్మించడం వల్ల రాత్రి వేళ పూజ చేయడం కూడా మంచిదని పండితులు సూచిస్తున్నారు. 

జన్మాష్టమి పూజా విధానం

ముందుగా బాల గోపాల్‌కు పాలు, పెరుగు, నెయ్యి, గంగాజలంతో అభిషేకించాలి. దీని తరువాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి, లడ్డూ గోపాల్‌కు కొత్త బట్టలు వేయాలి. స్నానం చేసిన తర్వాత బాల గోపాల్‌ను చిన్న పిల్లాడిని అలంకరించినట్టు రెడీ చేయాలి. 

లడ్డూ గోపాల్ ను ఉయ్యాలలో వేసి ఊపాలి. ఆచారాల ప్రకారం పూజ చేయాలి.  వెన్న, చక్కెర మిఠాయిని అందించండి. ముందుగా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని బాల గోపాల్‌కి అందించండి. ఈ రోజు లడ్డూ గోపాల్‌కి ప్రసాదం చేసేటప్పుడు వెల్లుల్లి, ఉల్లిపాయలు వాడకూడదు. సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలి. అనంతరం లడ్డూ గోపాల్ కు హారతి ఇవ్వాలి. చిన్నపిల్లలను చూసుకున్నట్టుగా లడ్డూ గోపాల్ ను చూసుకోవాలి. 

ఈ మంత్రాలను జపించండి:

1.  కృష్ణాయ నమః

2. ఓం క్రీం కృష్ణాయ నమః

3. ఓం గోకుల్ నాథాయ నమః

4. ఓం గోవల్లభాయ స్వాహా

5. ఓం నమో భగవతే శ్రీ గోవిందాయ్

6. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ-కృష్ణ హరే హరే. హరే రామ్ హరే రామ్, రామ్-రామ్ హరే-హరే

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.