హిందూ మతంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శివ మహాపురాణం ప్రకారం శ్రావణ సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే ఆయన కటాక్షం లభిస్తుంది. శ్రావణ సోమవారం నాడు శివుడిని పూజించి, హారతి ఇస్తే మీ కోరికలన్నీ తీరే అవకాశం ఉంది. ఆర్ధిక బాధలు తీరుతాయి. శ్రావణ సోమవారం నాడు శివలింగాన్ని గంగాజలంతో శుభ్రపరిచి పాలాభిషేకం చేయాలి. అలా తేనెతో అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజిస్తే ఎంతో మంచిది. ఈ శ్రావణ మాసంలో అయిదు సోమవారాలు వస్తాయి. ఈ అయిదు సోమవారాల్లో శివుడిని పూజిస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయి.
శ్రావణ సోమవారంనాడు శివుడికి పూజ చేశాక చివరలో హారతితో ముగించాలి. హారతి ఇచ్చేటప్పుడు ఇక్కడ మేమిచ్చిన హారతి మంత్రాన్ని చదివితే ఎంతో మంచిది. ఇది మీ ఆత్మను శుద్ధి చేస్తుంది. మీలోని ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా భర్త సుఖాన్ని కోరుకునే స్త్రీలకు ఇది ఎంతో శుభప్రదం. వారిద్దరి బంధం కూడా బలోపేతంగా మారుతుంది.
టాపిక్