Indira Ekadashi Vratham: ఇందిరా ఏకాదశి తేదీ, పూజా సమయం ఎప్పుడంటే?
Indira Ekadashi 2024: హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి ఉపవాసం పాటించడం శుభ ఫలితాలను ఇస్తుంది. సెప్టెంబర్‌లో ఇందిరా ఏకాదశి ఎప్పుడు వస్తుందో, పూజా సమయం, ఉపవాస సమయం ఇక్కడ తెలుసుకోండి.
Indira Ekadashi Date: హిందూ మతంలో ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాసం ఉంటారు. ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సర్వ దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
పితృ పక్షం సమయంలో ఈ ఏడాది ఇందిరా ఏకాదశి 28 సెప్టెంబర్ 2024 శనివారం వస్తోంది. ఇందిరా ఏకాదశి నాడు సిద్ధ, సధ్య యోగాల కలయిక ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ రెండు యోగాలను శుభకార్యాలకు చాలా మంచిదిగా భావిస్తారు. ఈ యోగాలలో చేసే పనిలో విజయం లభిస్తుందని నమ్ముతారు. ఇందిరా ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును పూజించే శుభ సమయం శుభసమయం గురించి తెలుసుకోండి.
ఇందిరా ఏకాదశి పూజ ముహూర్తం
ఏకాదశి తిథి 27 సెప్టెంబర్ 2024న మధ్యాహ్నం 01:20 గంటలకు ప్రారంభమై, 28 సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 02:49 గంటలకు ముగుస్తుంది. ఇందిరా ఏకాదశి పూజా సమయం ఉదయం 07.41 గంటల నుంచి 09.11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 01.40 నుంచి 03.10 గంటల వరకు శుభ సమయం ఉంటుంది. మధ్యాహ్నం 03.10 గంటల నుంచి సాయంత్రం 04.40 గంటల వరకు పూజా సమయం ఉంటుంది.
సిద్ధ, సధ్యయోగం: ఏకాదశి రోజున సిద్ధయోగం రాత్రి 11.51 గంటల వరకు కొనసాగుతుంది. దీని తరువాత సధ్య యోగం ప్రారంభమవుతుంది.
సూర్యోదయం తర్వాతే
హిందూ మత గ్రంథాల ప్రకారం ఏకాదశి ఉపవాసం ముగియడాన్ని వ్రత పరాన్నవం అంటారు. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం ఆచరించాలి. ఇందిరా ఏకాదశి రోజున కొంతమంది కటిక ఉపవాసం ఉంటారు. ఎవరైనా అలా ఉండలేమని భావిస్తే ఒక్కసారి పండ్లు తినొచ్చు. ఆరోజున ఏ చెట్టు నుంచి ఆకులని తెంపకూడదు.
వ్రత పారాయణ సమయం
29 సెప్టెంబర్ 2024న ఆదివారం నాడు ఇందిరా ఏకాదశి వ్రతం పారాయణం చేయాలి. వ్రత పారాయణం శుభ సమయం ఉదయం 06.12 నుండి 08.35 వరకు ఉంటుంది. వ్రత పారాయణం రోజున ద్వాదశి తిథి ముగిసే సమయం సాయంత్రం 04.47 గంటలు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.