Odd things: రోడ్డు మీద వెళ్లేటప్పుడు వీటిని పొరపాటున కూడా తొక్కకండి, ఇబ్బందుల్లో పడతారు
Odd things: రోడ్డు మీద వెళ్లేటప్పుడు నిమ్మకాయలు, మిర్చి, పగలగొట్టిన కొబ్బరి కాయలు కనిపిస్తాయి. అలాంటి వాటి దగ్గరకు కూడా వెళ్లకూడదని చాలా మంది నమ్ముతారు. అవి మాత్రమే కాదు ఇవి మీకు రోడ్డు మీద కనిపించినా వాటి జోలికి వెళ్ళకండి చిక్కుల్లో పడతారు.
Odd things: సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దిష్టి తీసేసిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలు, నిమ్మకాయలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని తొక్కకుండా ఓ పక్కగా వెళ్లిపోతూ ఉంటారు. దిష్టి తీసిన వాటిని తొక్కడం వల్ల నెగటివ్ ఎనర్జీ మన వెంట వస్తుందని చాలా మంది నమ్ముతారు.
నిమ్మకాయలు, మిర్చి ఎండిపోయినవి చెల్లాచెదురుగా వేసి ఉంటారు. అవి దిష్టి తీసి వేసినవని అందరికీ తెలుసు. అయితే అవి మాత్రమే కాదు రోడ్డు మీద మీకు ఇవి కనిపించినా కూడా వాటి దగ్గరకు వెళ్ళడం, వాటిని తొక్కడం వంటివి చేయకపోవడం ఉత్తమం. లేదంటే ప్రతికూలత వ్యాపించే అవకాశం ఉంటుందని కొందరు నమ్ముతారు.
కుంకుమ
హిందూ ధర్మ శాస్త్రంలో కుంకుమ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వివాహిత స్త్రీ నుదుట తప్పనిసరిగా ఉంటుంది. ఇది వైవాహిక జీవితానికి చిహ్నంగా భావిస్తారు. అయితే కుంకుమ దీని కోసం మాత్రమే ఉపయోగించారు. సాధారణంగా చేతబడితో సంబంధం ఉన్న కొన్ని పద్ధతులలో కూడా కుంకుమ ఉపయోగిస్తారు. అందుకే మీకు రోడ్డు మీద కుంకుమ కనిపిస్తే దాన్ని తొక్కడం వంటివి చేయకూడదు. వాటిని తాకకుండా ఉండం మంచిది.
కాల్చిన కొబ్బరికాయ
ఆచారాల ప్రకారం కొబ్బరి కాయను దేవతలకు సమర్పించడం చేస్తారు. అయితే రోడ్డు మీద కాలిన కొబ్బరికాయ కనిపిస్తే దానికి దూరంగా వెళ్ళడం చేయాలి. ఏదైనా చెడును నివారించేందుకు లేదా చెడు శక్తులను తొలగించేందుకు ఇలా కొబ్బరి కాయను కాలుస్తారు. అందుకే అటువంటిది మీకు కనిపిస్తే దాటడం, తొక్కడం వంటివి చేయకుండా దూరంగా ఉండాలి.
జుట్టు
జుట్టు ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు అంటూ మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉండే మాట ఇది. ఎందుకంటే తంత్ర పూజలు, చేతబడిలో ఎక్కువగా జుట్టు ఉపయోగిస్తారు. అందులో జుట్టు పారేయకూడదు అంటారు. మన జుట్టు ఎప్పుడు ఇతరుల చేతికి వెళ్లకూడదు. మీకు రోడ్డు మీద జుట్టు కనిపిస్తే దాన్ని దాటకుండా, తొక్కకుండా ఉండటం ఉత్తమం. లేదంటే వాటిని తొక్కడం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
లవంగాలు, తమలపాకులు
లవంగాలు, తమలపాకులు సాధారణ అనుకూల ఆచారాలలో మాత్రమే కాదు ప్రతికూల ఆచారాలలో కూడా ఉపయోగిస్తారు. తమలపాకులు తరచుగా దేవతలకు నైవేద్యంగా పెడతారు. ఇక లవంగాలను ఆధ్యాత్మిక ఆచారాలలో ఉపయోగిస్తారు. కానీ కొన్ని సార్లు ఇవి రెండూ కలిపి చేతబడి చేసేందుకు ఉపయోగిస్తారు. ఒకరి మీద చెడు ఉద్దేశం ఉన్న వ్యక్తులు వీటిని ఉపయోగించుకుంటారు. అందుకే తమలపాకుకు అంటుకున్న లవంగాలు కనిపిస్తే వాటిని పొరపాటున కూడా తాకవద్దు. ఇవి చెడును సూచిస్తాయి.
భయం కలిగించే బొమ్మలు
గగుర్పాటు కలిగించేవి, వింతగా అనిపించే బొమ్మలు ఎక్కడ కనిపించినా వాటికి దూరంగా ఉండటమే మంచిది. పురాతన కాలం నుంచి బొమ్మలను క్షుద్ర పూజలకు ఉపయోగిస్తూ వస్తున్నారు. ఎవరినైనా నియంత్రించేందుకు, హాని కలిగించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. అందుకే గగుర్పాటు కలిగించే బొమ్మలకు పిన్నులు, సూదులు, ఇతర పదునైన వస్తువులు పెట్టినట్టు కనిపిస్తే వాటిని అసలు ముట్టుకోవద్దు.
కొవ్వొత్తులు
రోడ్డు మీద లేదంటే ఫుట్ పాత్ లేదా రోడ్డు మధ్యలో వెలిగించిన కొవ్వొత్తి కనిపిస్తే దానికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కొవ్వొత్తులు కూడా చేతబడి, క్షుద్ర పూజలకు ఉపయోగిస్తారు. దుష్ట ఆత్మలకు అర్పణలుగా చూస్తారు. ఎర్రటి పొడి లేదా నల్ల బూడిదతో ఉన్న వెలిగించిన కొవ్వొత్తిని చూస్తే వాటిని పట్టుకోకూడదు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్