Money plant vastu tips: శుక్రవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేశారంటే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు-if you do this near the money plant on friday there will be no shortage of money in your house ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Money Plant Vastu Tips: శుక్రవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేశారంటే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు

Money plant vastu tips: శుక్రవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేశారంటే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు

Gunti Soundarya HT Telugu
Mar 15, 2024 01:00 PM IST

Money plant vastu tips: శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు. అటువంటి రోజు సంపదని పెంచే మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేస్తే మీ ఇంత డబ్బుకు కొరత ఉండదు. అప్పుల బాధలు తొలగిపోతాయి.

మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు
మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు (pexels)

ప్రతిఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. సంపదని ఇచ్చే లక్ష్మీదేవిని సంతోషపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. సంపద, శ్రేయస్సు కోసం ప్రజలు ఇంట్లో డబ్బుకు సంబంధించిన కొన్ని మొక్కలు నాటుతారు. వాటి వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని భావిస్తారు.

ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల సంపద, సౌభాగ్యం నెలకొంటాయని, సానుకూలత విస్తరిస్తుందని చెబుతారు. అయితే మనీ ప్లాంట్ పెట్టిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రవారం రోజు డబ్బు ప్రయోజనాలు పొందడం కోసం మనీ ప్లాంట్ దగ్గర ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. శుక్రవారం పూట లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా ప్రత్యేకం. ఈరోజు మనీ ప్లాంట్ దగ్గర ఈ పరిహారాలు చేయడం వల్ల మీ ఇంట డబ్బు కొరత ఉండదు.

శుక్రవారం పరిహారాలు

శుక్రవారం నాడు మనీ ప్లాంట్ కి ఎర్ర దారాన్ని కట్టాలి. ఇది సంపదని తీసుకురావడమే కాకుండా ఇంట్లో సానుకూలతను పెంచుతుంది. అలాగే శుక్రవారం మనీ ప్లాంట్ మూలంలో పచ్చిపాలని పోయాలి. ఇలా చేయడం వల్ల ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది.

ఆర్థిక సమస్యలు, అప్పులు బాధతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారా? డబ్బు సంపాదించిన చేతిలో నిలవడం లేదని బాధపడుతున్నారా? అయితే శుక్రవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర ఈ పరిహారం చేస్తే మీ సమస్యలు దూరం అవుతాయి. సంపద తిరిగి వస్తుంది.

ఒక గ్లాస్ నీళ్లలో రాళ్ల ఉప్పు వేసి బాగా కరిగించి ఆ నీటిని మనీ ప్లాంట్ మొదట్లో పోయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈ నీటిని ఆకుల మీద కూడా చల్లాలి. ఈ పరిహారాన్ని 21 శుక్రవారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి.

మనీ ప్లాంట్ వాస్తు చిట్కాలు

మనీ ప్లాంట్ ని ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచుకోవాలి. ఈ దిశలో విఘ్నాలు తొలగించే గణేశుడు నివసిస్తాడని నమ్ముతారు. అందుకే ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి. ఐశ్వర్యం, అదృష్టం, శ్రేయస్సుని ఆకర్షిస్తుంది. ఇంటి ఉత్తర దిశ కుబేరుడు నివసిస్తాడని నమ్ముతారు. అందువల్ల వాస్తు ప్రకారం మీరు మనీ ప్లాంట్ ని ఈ దిశలో ఉంచుకుంటే సంపద, శ్రేయస్సు లభిస్తుంది.

దక్షిణ దిశలో పెట్టుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కీర్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మనీ ప్లాంట్ పశ్చిమం, నైరుతి దిశలో మాత్రం పొరపాటున కూడా పెట్టకూడదు. ఇలా చేస్తే మీ కెరీర్ లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక అస్థిరత ఎదుర్కోవాల్సి వస్తుంది.

రాత్రిపూట మీరు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే పడకగదిలో మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. దీనికి ప్రతిరోజు నీరు పోయడం, తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. సరిగా సంరక్షించుకుంటే మనీ ప్లాంట్ 12 అడుగుల వరకు పెరుగుతుంది. మీ జీవితంలో అదృష్టం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లయితే మనీ ప్లాంట్ ని చక్కగా చూసుకోవాలి. దీన్ని ఇంటి బయట ఉంచకూడదు. అలాగే మనీ ప్లాంట్ ఆకులు నేలని తాకకూడదు.

టాపిక్