Superstitions: రాత్రిపూట రావిచెట్టు కింద కూర్చుంటే దెయ్యాలు పడతాయా? ఇందులో నిజమెంత?-do ghosts fall if you sit under a peppal tree at night how true is this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Superstitions: రాత్రిపూట రావిచెట్టు కింద కూర్చుంటే దెయ్యాలు పడతాయా? ఇందులో నిజమెంత?

Superstitions: రాత్రిపూట రావిచెట్టు కింద కూర్చుంటే దెయ్యాలు పడతాయా? ఇందులో నిజమెంత?

Gunti Soundarya HT Telugu
Jul 03, 2024 12:15 PM IST

Superstitions: రావి చెట్టు కింద రాత్రివేళ కూర్చుంటే దెయ్యాలు పడతాయని చాలా మంది నమ్ముతారు. ఇదొక మూఢ నమ్మకం అని చాలా మంది కొట్టేస్తారు. అయితే ఇలా చెప్పడం వెనుక కారణం ఏమిటో తెలుసా?

రావిచెట్టు కింద కూర్చుంటే ఏమవుతుంది?
రావిచెట్టు కింద కూర్చుంటే ఏమవుతుంది? (pinterest)

Superstitions: ఎవరైనా బయటికి వెళ్లేటప్పుడు తుమ్మితే కాసేపు కూర్చొని ఒక గ్లాస్ మంచి నీళ్లు తాగి వెళ్ళమని చెబుతారు. నల్ల పిల్లి, కుక్క, కాకి… ఇలాంటివి ఏవైనా ఎదురైతే అశుభంగా భావిస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఎప్పటి నుంచో సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.

కొన్ని నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారిపోయాయి. ప్రజలు ఇప్పటికీ వాటికి కట్టుబడే ఉంటున్నారు. ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు వేలాడదీయడం వాళ్ళ దుష్టశక్తులు ఇంట్లోకి రాలేవని అంటారు. పిల్లి ఎదురైతే బయటికి వెళ్లకుండా ఆగిపోవడం వంటి కొన్ని మూఢనమ్మకాలకు సంబంధించి కొన్ని వివరణలు ఉన్నాయి. పెద్దలు అలా ఎందుకు చెప్పారు వాటి వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం.

పిల్లి వెనుక వెళ్లకూడదు

నల్ల పిల్లి ఎదురుపడటం, అది వెళ్ళిన మార్గంలో వెళ్ళడం దురదృష్టంగా పరిగణిస్తారు. భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర ప్రాంతాల్లో కూడా నల్ల పిల్లలు దురదృష్టానికి ముడిపడి ఉన్నాయని నమ్ముతారు. అయితే ఇలా చెప్పడం కనుక ఒక కారణం ఉంది. పురాతన కాలంలో నల్ల పిల్లలు దాదాపు అడవి జంతువుల మాదిరిగానే ఉండేవి. వాటి కదలికలు ప్రమాదానికి సంకేతంగా భావిస్తారు. వాటిని అనుసరించి వెళ్తే అడవి జంతువుల దగ్గరకు వెళ్తారని అందుకే పిల్లి నడిచిన మార్గంలో నడవకూడదు అని చెబుతారు.

అద్దం పగలడం దురదృష్టకరమా?

ఎక్కువ మంది నమ్మే మూఢనమ్మకం ఇది. అద్దం పగిలితే ఏడు సంవత్సరాల దురదృష్టం అంటుకుంటుందని అంటారు. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని కొందరు చెబుతారు. అద్దాలు ఆత్మలకు నిలయం అనే నమ్మకం నుండి ఈ మాట ఉద్భవించింది. అద్దాలు శక్తులను గ్రహిస్తాయి. ఆత్మలను పట్టుకోగలవనే నమ్మకం వాటి ప్రతిబింబ లక్షణాలు నుంచి వచ్చింది. కానీ నిజానికి అద్దాలు ఒకప్పుడు అరుదైన, ఖరీదైన వస్తువులు. అద్దం చాలా ఖరీదు అందువల్ల దాన్ని పగలగొట్టకూడదని అంటారు. అందుకు దాన్ని ధర కూడా కారణం కావచ్చు. అలాగే పూర్వంలో అద్దాలు చాలా అరుదుగా దొరికేవి. అందుకే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతారు.

సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు కత్తిరించకూడదా?

అనేక సంస్కృతులలో సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు కత్తిరించడం వల్ల దురదృష్టాన్ని తీసుకొస్తుందని, దుష్టశక్తులను ఆకర్షిస్తుందని నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. ఇలా చెప్పడం వెనుక ఒక కారణం ఉంది. పాత కాలంలో సూర్యాస్తమయం తర్వాత విద్యుత్ దీపాలు ఉండేవి కావు. వెలుతురు సరిగా లేకపోవడం వల్ల చీకటిలో గోర్లు కత్తిరించినప్పుడు చేతులు గాయపడే అవకాశం ఉంది. దీనివల్ల రక్తస్రావం అవుతుంది. ఆ సమయంలో ఆస్పత్రికి చేరుకోవడానికి సరైన మార్గాలు కూడా ఉండేవి కావు. అందువల్ల అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు కత్తిరించుకోవద్దని పెద్దలు సూచిస్తారు.

రావి చెట్టు కింద కూర్చోకూడదు

ఇప్పటికీ ఎక్కువ మంది ఈ విషయాన్ని నమ్ముతారు. రాత్రివేళ రావి చెట్టు కింద కూర్చోవడం వల్ల దెయ్యాలు పట్టుకుంటాయని అంటారు. ఈ చెట్టు ఆత్మలకు నిలయంగా ఉంటుందని చెబుతారు. అయితే ఈ చెట్టు కింద కూర్చోవద్దని చెప్పడం వెనుక మరొక కారణం ఉంది. చెట్లు ఉదయం సమయంలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ విడుదల చేస్తాయి. రాత్రి సమయంలో అవి ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. రాత్రిపూట రావి చెట్టు లేదా మరేదైనా చెట్టు కింద కూర్చోవడం అంటే ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ను పీల్చడమే. ఇది ఆరోగ్యానికి హానికరం. అది మాత్రమే కాకుండా దట్టంగా ఉండే ఆకులలో గుడ్లగూబలు, కాకులు, పక్షులకు నిలయంగా ఉంటుందని ఇలా చెప్తారు.

గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?

చాలామంది ఇళ్లల్లో ఇది ఎప్పటికీ పాటిస్తూనే ఉంటారు. నిమ్మకాయ మిరపకాయ కలిపి కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఈ రెండు బయట ఉండటం వల్ల వాటి బలమైన లక్షణాల కారణంగా దుష్ట శక్తులు ఏవి ఇంట్లోకి ప్రవేశించలేవని నమ్ముతారు. కానీ వాస్తవానికి నిమ్మకాయ, మిరపకాయలు రెండూ ఘాటైన సువాసన కలిగి ఉంటాయి. ఇవి సహజ రసాయనాలను కలిగి ఉంటాయి. కీటకాలు, తెగుళ్ళను తిప్పికొట్టగలవు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వీటిని వేలాడదీయడం వల్ల ఆహార పదార్థాలను, వ్యాధులను కలిగించే హానికరమైన కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఇవి అడ్డుకుంటాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner