Jyeshtha Amavasya: జ్యేష్ట అమావాస్య ఎప్పుడు, ఆ రోజు పాటించాల్సిన పూజా విధానాలేంటి?-ashadha amavasya when is ashadha amavasya and what are the rituals to be followed on that day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jyeshtha Amavasya: జ్యేష్ట అమావాస్య ఎప్పుడు, ఆ రోజు పాటించాల్సిన పూజా విధానాలేంటి?

Jyeshtha Amavasya: జ్యేష్ట అమావాస్య ఎప్పుడు, ఆ రోజు పాటించాల్సిన పూజా విధానాలేంటి?

Haritha Chappa HT Telugu
Jul 04, 2024 01:56 PM IST

Jyeshtha Amavasya: హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అమావాస్య తిథి ప్రతి నెలా ఒకసారి వస్తుంది.

అమావాస్య ఎప్పుడు?
అమావాస్య ఎప్పుడు?

హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. అమావాస్య తిథి ప్రతి నెలా ఒకసారి వస్తుంది. అమావాస్య రోజు పితృదేవతలకు అంకితం చేస్తారు. ఈ రోజున స్నానం చేయడం, శ్రాద్ధ తర్పణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. జ్యేష్ట అమావాస్య ఎప్పుడో, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి.

జ్యేష్ట అమావాస్య తేదీ - జూలై 5, 2024

ముహూర్తం -

జ్యేష్ట, కృష్ణ అమావాస్య ప్రారంభం - 04:57 ఉదయం, జూలై 05

జ్యేష్ట, కృష్ణ అమావాస్య ముగింపు - 04:26 ఉదయం, జూలై 06

జూలై 1 నుండి సూర్యుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి ఎన్నో రాశులకు మంచి ఫలితాలను అందిస్తారు.

పూజ ఇలా చేయాలి

అమావాస్య రోజు ఉదయానే లేచి పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. లేదా ఇంట్లోని నీళ్లలో గంగాజలాన్ని కొంచెం కలుపుకుని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత ఇంటి గుడిలో దీపం వెలిగించాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. మీరు ఉపవాసం ఉండగలిగితే, ఈ రోజు కూడా ఉపవాసం ఉండండి. ఈ రోజున పూర్వీకులకు సంబంధించిన పనులు చేయాలి. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించండి. దానధర్మాలు చేయండి. ఈ పవిత్రమైన రోజున భగవంతుడిని ఎక్కువగా ధ్యానించండి. ఈ పవిత్రమైన రోజున విష్ణువు ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శివుడిని కూడా ఆరాధిస్తే ఎంతో మంచిది. జూన్ 30న శని గమనం మారుతుంది, జాతకం వివరాలతో ప్రత్యేక పరిహారాలు తెలుసుకోండి

జ్యేష్ఠ అమావాస్య ప్రాముఖ్యత

అమావాస్య తిథి నాడు శివుడు, పార్వతిని పూజించినా మేలు జరుగుతుంది. ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయురూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం, శ్రాద్ధం కోరుకుంటారు. కాబట్టి, ఈ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి నైవేద్యాలు సమర్పించి, బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి. పితృ పూజ చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.

అమావాస్య రోజున దానాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. పేదలకు దుస్తులు, ఆహారం దానం చేయండి. కొన్ని రకాల ధాన్యాలను కూడా దానం చేయడం చాలా ముఖ్యం. ఏడాదిలో 12 అమావాస్యలు ఉంటాయి. ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. జూలైలో వచ్చే జ్యేష్ట అమావాస్యను హలహరిణి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున రైతులు వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు.

ఆర్ధిక సమస్యలు పొగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది. ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది.

Whats_app_banner