Nourishing Oils । శీతాకాలంలో శరీర సంరక్షణకు ఈ 5 నూనెలు ఉపయోగించండి!
Nourishing Oils for Winter Routine: జుట్టు రాలడం నుండి పొడి చర్మం వరకు, ఈ శీతాకాలంలో మీ జుట్టుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా, ఇక్కడ పేర్కొన్న 5 నూనెలను ఉపయోగించండి చాలు..
(1 / 7)
చలికాలం ప్రారంభం కాగానే జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు రావడం కామన్. దానికి అనుగుణంగా మన సంరక్షణ ఉండాలి.
(3 / 7)
మోగ్రా ఆయిల్ - జుట్టు రాలడం అరికట్టడంలో మోగ్రా ఆయిల్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి గోరువెచ్చని కొబ్బరి నూనెతో కలిపి, తలకు మసాజ్ చేయండి. కండరాల నొప్పిని తగ్గించడానికి కూడా మోగ్రా నూనెను వాడతారు.
(4 / 7)
సెడార్‌వుడ్ ఆయిల్/దేవదారు తైలం: చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచుకోవడానికి దేవదారు తైలంను ఉపయోగించండి. ఈ నూనెను ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు రావు. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయడానికి ఒక గంట ముందు దేవదారు నూనెతో శరీరమంతా మసాజ్ చేయండి.
(5 / 7)
దాల్చిన చెక్క నూనె: ఈ నూనె కూడా ముఖం మీద ముడతలను తగ్గిస్తుంది, వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. శీతాకాలంలో ఈ నూనెను ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క నూనెను మీ తల,ముఖానికి రాయండి. ఇది నాడులపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
(6 / 7)
టర్మరిక్ ఆయిల్- యాంటిసెప్టిక్ గుణాలు కలిగిన పసుపు నూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మ కణాలను రక్షిస్తాయి. మొటిమలు, మచ్చలు సహా ఇతర చర్మ సంబంధిత సమస్యలను సంపూర్ణంగా పరిష్కరిస్తుంది.
(7 / 7)
క్యారెట్ ఆయిల్ - మీ చర్మంపై మీకు ఏదైనా రకమైన అలెర్జీ ఉంటే, క్యారెట్ నూనెతో ఆ ప్రాంతాన్ని మసాజ్ చేయండి. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు, గాయాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణజాలంలోని అరుగుదలను సరిచేసి, వాటిని మరింత దెబ్బతినకుండా కాపాడతాయి.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు