తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Tourism : సెలవుల్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి వెళ్లండి.. ఒకే రోజులో అన్ని కవర్ చేయొచ్చు
- Telangana Tourism : స్కూళ్లకు దసరా సెలవులు వచ్చాయి. దీంతో చాలామంది మంచి టూరిస్ట్ ప్లేసులకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారికి వరంగల్ జిల్లా అనువైన ప్రాంతం. ఇక్కడ ఒకే రోజులో కవర్ చేసే టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే.. ఆహ్లాదం తోపాటు.. పిల్లలకు చరిత్ర కూడా తెలుస్తుంది.

(1 / 6)
వరంగల్ జిల్లా.. తెలంగాణ చరిత్రకు అద్దం. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైంది వరంగల్ కోట. కాకతీయ కళాతోరణం, కాకతీయ కట్టడాలు, ఖుష్‌మహల్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంటుంది.ఈ హాలిడేస్‌లో ఇక్కడికి వస్తే.. ఎంజాయ్ చేయొచ్చు.(Warangal Tourism)
(2 / 6)
వరంగల్ అంటేనే.. ఫస్ట్ గుర్తొచ్చేది చెరువులు. ఆ చెరువుల్లో ప్రధానమైంది పాకాల సరస్సు. దట్టమైన అడవుల్లో ఈ చెరువు ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండుకుండలా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు.(Warangal Tourism)
(3 / 6)
వరంగల్ జిల్లాలో ఉన్న మరో ప్రధానమైన చెరువు రామప్ప సరస్సు. ఇక్కడ బోటింగ్ చాలా స్పెషల్. రామప్ప చెరువు ఒడ్డున్నే తెలంగాణ టూరిజం హోటల్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో స్టే చేయొచ్చు.(Warangal Tourism)
(4 / 6)
రామప్ప సరస్సుకు అతి సమీపంలో.. రామప్ప ఆలయం ఉంది. కాకతీయుల కాలంలో కట్టిన ఈ ఆలయానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. పిల్లలను ఇక్కడికి తీసుకెళ్తే.. ఓరుగల్లు చరిత్రను కళ్లకుకట్టినట్టు చూపించొచ్చు.(Warangal Tourism)
(5 / 6)
దట్టమైన అడవుల్లో మరో సరస్సు ఉంది. అదే లక్నవరం సరస్సు. ఇక్కడ తీగల వంతెన చాలా స్పెషల్. చెరువు మధ్యలో కాటేజీలు ఉంటాయి. స్వచ్ఛమైన గాలిలో.. చుట్టూ పచ్చని అడవులు ఆహ్లాదాన్ని పంచుతాయి.(Warangal Tourism)
ఇతర గ్యాలరీలు