తెలుగు న్యూస్ / ఫోటో /
Off-roading in India | కఠిన దారుల్లో సాహసోపేతమైన డ్రైవ్‌కు వెళ్లాలా..?
- మీకు కఠినమైన దారుల్లో వాహనాలతో అడ్వెంచర్లు చేయటమంటే ఇష్టమా? ఇండియాలో ఆఫ్-రోడింగ్ ఎంజాయ్ చేయటానికి అనువైన, అద్భుతమైన ప్రదేశాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. అయితే ఇలాంటి సాహసాలు చేయాలంటే ముందు మీరు సరైన SUVని ఎంచుకోవాలి, అన్ని రకాల ముందస్తు భద్రత చర్యలను తీసుకోవాలి.
- మీకు కఠినమైన దారుల్లో వాహనాలతో అడ్వెంచర్లు చేయటమంటే ఇష్టమా? ఇండియాలో ఆఫ్-రోడింగ్ ఎంజాయ్ చేయటానికి అనువైన, అద్భుతమైన ప్రదేశాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. అయితే ఇలాంటి సాహసాలు చేయాలంటే ముందు మీరు సరైన SUVని ఎంచుకోవాలి, అన్ని రకాల ముందస్తు భద్రత చర్యలను తీసుకోవాలి.
(1 / 7)
వీకెండ్స్ లేదా ఏవైనా సెలవులు వచ్చినపుడు కొందరు లాంగ్ డ్రైవ్ లను ఇష్టపడితే, మరికొందరు అడ్వెంచర్ రైడ్లను ఇష్టపడతారు. మీరు మీ SUVతో ఆఫ్-రోడింగ్ ట్రయల్స్‌కు వెళ్లాలనుకుంటే.. అందుకు భారతదేశంలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.(Representative Image (Unsplash))
(2 / 7)
జోజి లా పాస్: జమ్మూ- కాశ్మీర్‌లో ఉన్న ఈ బాట చాలా ఎత్తులో ఉంటుంది. ఏదైనా వాహనం వెళ్లాలంటే కూడా దారులు చాలా ఇరుకుగా ఉంటాయి. కానీ ఆఫ్-రోడింగ్ ట్రయల్స్‌ను ఇష్టపడేవారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. చుట్టూ మంచు దుప్పటి కప్పకున్న ఎత్తైన పర్వతాలు, దృశ్యాలు ఎంతో మనోహరంగా అనిపిస్తుంది.(Representative Image (Unsplash))
(3 / 7)
బిలిగిరిరంగ హిల్స్: దీనినే BR-బెట్ట అని కూడా పిలుస్తారు. ఈ బాట కర్ణాటకలో ఉంది. మీరు బెంగుళూరులో నివసిస్తుంటే, మీ స్నేహితులతో కలిసి ఇక్కడకు ఆఫ్-రోడింగ్‌కు వెళ్లవచ్చు. మొత్తం 60 కి.మీ దారిలో అడ్వెంచర్ ఒక గొప్ప అనుభూతినిస్తుంది.(Representative Image (Unsplash))
(4 / 7)
బిస్లే ఘాట్: కర్ణాటకలోని సకలేష్‌పూర్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో ఈ ప్రదేశమంతా పచ్చదనం పరుచుకున్న స్వర్గధామంలా కనిపిస్తుంది. ఇది ఆఫ్-రోడింగ్ కోసం ఈ ప్రదేశం ఎంచుకోవచ్చు. ఈ మార్గంలో మీరు సుమారు 15 జలపాతాలను కూడా చూడవచ్చు.(Representative Image (Unsplash))
(5 / 7)
థానమీర్: నాగాలాండ్‌లోని కిఫిరే జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం అత్యంత కష్టతరమైన ఆఫ్-రోడింగ్ ట్రయల్స్‌లో ఒకటి. 80 కిలోమీటర్ల వరకు ఉండే ఈ మార్గంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.(Representative Image (Unsplash))
(6 / 7)
సచ్ పాస్: సముద్ర మట్టానికి 4,420 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మార్గం జూలై నుండి అక్టోబర్ వరకు మాత్రమే సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. ఈ మార్గంలో ఆఫ్-రోడింగ్ ఒక గొప్ప అనుభూతి.(Representative Image (Unsplash))
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు