తెలుగు న్యూస్ / ఫోటో /
Royal Enfield Scram 411 బైక్‌తో అడ్వెంచర్ కూడా.. డైలీ అవసరాల కోసం కూడా
- రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరొక అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ 'రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411' బైక్‌ను కంపెనీ విడుదల చేసింది. మూడు వేరియంట్‌లలో అలాగే ఏడు రంగులలో అందుబాటులో ఉండే ఈ సరికొత్త బైక్‌ను పరిమితకాలం కోసం రూ. 2.03 ప్రారంభ ధరతో విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.

(1 / 7)
రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లలో ఇప్పటికే ఎంతో ప్రజాదరణ పొందిన ‘హిమాలయన్ ADV’ మోడెల్‌కు మరొక ప్రత్యామ్నాయ ఛాయిస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్ నిలవనుంది.
(2 / 7)
ఈ సరికొత్త స్క్రామ్ బైక్ అటు అడ్వెంచర్ యాత్రలకు, సాధారణ అవసరాలకు ఇలా రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు
(3 / 7)
స్క్రామ్ 411లో అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ ఉంది. ముందు భాగంలో 190 మిమీ ట్రావెల్‌తో 41 మిమీ ఫ్రంట్ ఫోర్క్ లభిస్తుండగా, వెనుకవైపు మోనోషాక్ యూనిట్ ఇచ్చారు.
(4 / 7)
పరిమిత కాలం కొరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ధర రూ. 2.03 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. మున్ముందు ధరలు పెరగొచ్చు.
(5 / 7)
హిమాలయన్ వెర్షన్ లో ఉన్నట్లుగానే స్క్రామ్ వెర్షన్ లో కూడా అదే 411 cc సింగిల్-సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఇది 24.3 bhp వద్ద 32 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
(6 / 7)
అయితే హిమాలయన్ కు దీనికి తేడా ఏంటంటే.. స్క్రామ్ 411లో ఫ్రంట్ వీల్ చిన్నగా 19-అంగుళాలతో ఉంటుంది. ఫ్రంట్ హెడ్‌ల్యాంప్ వృత్తాకారంగా ఉండి కొద్దిగా నిటారుగా ఉన్న ఫ్రంట్ రేక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువగా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు