తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Liquor Sales : రికార్డు బ్రేక్ చేసిన మందుబాబులు, 8 రోజుల్లో రూ.852 కోట్ల మద్యం తాగేశారు
- Telangana Liquor Sales : తెలంగాణలో దసరా సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. గత 8 రోజుల్లో మద్యం విక్రయాలు కూడా భారీగా జరిగాయి. 8 రోజుల్లో 8.37 లక్షల మద్యం కేసులు, 14.53 లక్షల బీరు కేసులు విక్రయించారు. ఈ నెల 1వ తేదీ నుంచి గణాంకాలు పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

(1 / 6)
తెలంగాణలో దసరా, బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. పండగంటే ప్రతి ఇంట్లో మటన్ ముక్క, మద్యం చుక్క ఉండాల్సిందే. దీంతో రాష్ట్రంలో గత 8 రోజుల్లో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో విక్రయాలతో పోలిస్తే 25 శాతం(5 రోజుల్లో) అధికంగా మద్యం అమ్మకాలు జరిగాయని దుకాణదారులు అంటున్నారు.
(2 / 6)
ఈ నెల 1వ తేదీ నుంచి గణాంకాలు పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది దసరాతో పోలిస్తే ఈ సారి ఐదు రోజుల్లో అమ్మకాలు 15 శాతం పెరిగినట్లు సమాచారం.
(3 / 6)
రాష్ట్రంలో రోజుకు రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 10న రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు తరలించారు. ఒకే రోజు ఏకంగా 2.35 లక్షల బీర్లు వైన్ షాప్ లకు చేరాయి. ఈ ఏడాదిలో ఈ రెంజ్ లో బీర్ల అమ్మకాలు జరగడం ఇదే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
(4 / 6)
సాధారణంగా రోజుకు లక్ష కేసుల వరకు రూ.100 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి.
(5 / 6)
5 రోజుల మద్యం విక్రయాలు పరిశీలిస్తే రోజుకు 1.20 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. ఈనెల 1 నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు