TG Indiramma Housing Committees : ఇందిరమ్మ ఇళ్లపై మరో అడుగు ముందుకు - కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం నుంచి జీవో జారీ-telangana govt issued go on indiramma housing committees latest updates read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Committees : ఇందిరమ్మ ఇళ్లపై మరో అడుగు ముందుకు - కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం నుంచి జీవో జారీ

TG Indiramma Housing Committees : ఇందిరమ్మ ఇళ్లపై మరో అడుగు ముందుకు - కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం నుంచి జీవో జారీ

Oct 11, 2024, 06:23 PM IST Maheshwaram Mahendra Chary
Oct 11, 2024, 06:18 PM , IST

  • తెలంగాణలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో  జారీ అయింది. గ్రామ, మున్సిపాలిటలలో కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్‌ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులు, కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి, మహిళ సంఘాల నుంచి ఇద్దరు ఉండనున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధివిధానాలను ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే అర్హులను కూడా ఎంపిక చేసి మంజూరు పత్రాలను ఇవ్వాలని యోచిస్తోంది.

(1 / 5)

ఇదిలా ఉంటే ఇవాళ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు సంబంధించి జీవో జారీ అయింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

(2 / 5)

గ్రామ, మున్సిపాలిటలలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్‌ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులు. కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి ఉంటారు. 

(3 / 5)

మహిళ సంఘాల నుంచి ఇద్దరు కమిటీలో ఉండనుండగా… ఎస్సీ, బీసీ సభ్యులు ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. మున్సిపాలిటీలో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌, చైర్మన్‌ ఉంటారు.

(4 / 5)

 ఈ కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు